2021 లో ఇప్పటివరకు విడుదలయిన ది బెస్ట్ చిత్రాలు ఇవే..!!

P.Nishanth Kumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా దేశంలోని అన్ని చలన చిత్ర పరిశ్రమల నుంచి సంవత్సరానికి వేలకొలది సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. లక్షల కొలది సినిమాలను నిర్మితమవుతుండగా వాటిలో వేలసంఖ్యలో సినిమా లే రిలీజ్ అవుతు ఉంటాయి. అందులోని వందల సంఖ్యలో సినిమాలు మాత్రమే బాగుంటాయి. పదుల సంఖ్యలో సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. ఒకటో రెండో హిట్ లు గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా 2021 సంవత్సరం కి గాను టాప్ టెన్ ఇండియా సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తమిళ చిత్ర పరిశ్రమ అ నుంచి వచ్చిన మండేలా సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసిన సినిమా నాయట్టు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలన రీతిలో హిట్టయింది. షార్ట్ ఫిలిం గా తెరకెక్కిన గిలిపూచి నెట్ ఫిక్స్ లో విడుదలై మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. తెలుగునాట సంచలనం సృష్టించిన జాతి రత్నాలు సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించగా అమెజాన్ ప్రైమ్ లో కూడా దుమ్మురేపుతోంది.

తమిళనాట స్టార్ హీరోగా ఉన్న ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ సినిమా  విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ ఆర్ ఓ హం లాల్ నటించిన దృశ్యం రెండవ పార్ట్ అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల అయి ప్రేక్షకుల మెప్పును పొందింది. అమెజాన్ లో విడుదలైన మరో చిత్రం కాలా కూడా ప్రేక్షకులను మెప్పించింది. తండ్రి తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ ఉండే ఈ సినిమా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా జోజి, ద డిసిపిల్ మరియు గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలు ప్రేక్షకుల మెప్పును పొందిన ఈ సంవత్సరపు చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: