లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

Divya

2021 సంవత్సరం అంటే శార్వరి నామ సంవత్సరం మొదలై, ఆరు నెలలు కూడా కాలేదు..కానీ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు మాత్రం చోటు చేసుకున్నాయి. అంటే ఆరు నెలలు కూడా గడవక ముందే 15 మందికి పైగా సెలబ్రిటీలు చనిపోయారు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్  లో ఎంతో మంది కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది. ఇలా ఈ లాక్ డౌన్ లో ఎవరెవరు చనిపోయారో  వారి గురించి తెలుసుకుందాం..
ఇర్ఫాన్ ఖాన్ :
బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన, ఏప్రిల్ 29న క్యాన్సర్ బారిన పడి కన్నుమూసారు.
రిషికపూర్:
ఇర్ఫాన్ మరణం జరిగి ఒక్కరోజు కూడా గడవకముందే, బాలీవుడ్ లెజెండరీ రిషి కపూర్ ఏప్రిల్ 30న మరణించాడు. ఈయన కూడా క్యాన్సర్ తో కన్నుమూశాడు.
బసు ఛటర్జీ:
బాలీవుడ్లో మంచి మంచి క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈయన జూన్ 4వ తేదీన మరణించాడు .
వాజిద్ ఖాన్:
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన కిడ్నీ సమస్యతోపాటు కరోనా కారణంగా జూన్ 1న కన్నుమూశాడు.
ప్రేక్ష మెహతా:
బాలీవుడ్ సీరియల్స్ లో ఫేమస్ అయిన ప్రేక్ష ,మే 29న ఆత్మహత్య చేసుకుంది .ఈమె మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు.
యోగేష్ గౌడ్:
ప్రముఖ బాలీవుడ్ రచయిత మే 29న కన్నుమూశారు.
సెజల్ శర్మ:
బాలీవుడ్ సీరియల్ నటి ఈ ఏడాది ఆత్మహత్య చేసుకుంది.
మోహిత్ భాగెల్:
సల్మాన్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ,క్యాన్సర్ వ్యాధి బారిన పడి మే 29న చనిపోయాడు.
నిమ్మి:
యాభై ,అరవై దశకాల్లో బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటి,  ఈ లాక్ డౌన్  సమయంలోనే మరణించారు.
మన్మీత్ గ్రేవాల్:
టీవీ సీరియల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన ,  మే 16న ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు
అభిజిత్:
షారుక్ ఖాన్  రెడ్ చిల్లీ సంస్థలో అత్యంత కీలకంగా ఉండే ఈయన మే 19న కన్నుమూశారు.
సాయి గుండెవార్:
అమీర్ ఖాన్ పీకే, రాక్ ఆన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను, బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ మే 10న  యూఎస్ లో మరణించాడు
ఇక వీరితో పాటు షఫీక్ అన్సారీ మే 10, అమోస్ మే 12, సచిన్ కుమార్ మే 15, శ్రీ లక్ష్మీ కనకాల, బుల్లెట్ ప్రకాష్, అబ్దుల్లా వంటి నటులు సినీ ఇండస్ట్రీ ఇలా దాని కారణంగా కోల్పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: