ఆ సామాజిక వర్గాన్ని కించపరిచిన స్టార్ కమెడియన్.. ఎవరంటే?

kalpana

ఈ మధ్యకాలంలో తెలుగులో డబ్ అవుతున్న తమిళ సినిమాలు చూసే ప్రేక్షకులకు యోగిబాబు అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట్లో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న యోగిబాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు కమెడియన్  గా మరోవైపు హీరో పాత్రలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.త‌మిళ‌ నటుడు యోగిబాబు న‌టించిన‌ మండేలా సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు త‌మ‌ను కించ పర్చేలా ఉన్నాయంటూ నాయీ బ్రాహ్మణులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే..

నటుడు యోగిబాబుపై చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడు స్థాయికి ఎదిగిన నటుడు యోగిబాబు. కాగా ఇటీవల ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఇందులో నటుడు యోగిబాబు నాయీ బ్రాహ్మణుడి పాత్రలో నటించారు. మండేలా చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం నిర్వాహకులు శుక్రవారం చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.యోగి బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుందని చెప్పవచ్చు.                  
 
అందులో వారు పేర్కొంటూ మండేలా చిత్రంలో నాయీ బ్రాహ్మణ కార్మికులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, అదేవిధంగా వైద్య సామాజిక వర్గానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మండేలా చిత్ర దర్శక నిర్మాతలు అందులో నటించిన యోగిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యోగి బాబు ఈ క్రమంలోనే హీరోగా చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిక్కులు రావడం అతని కెరియర్ పై ప్రభావం పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు పేర్కొన్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: