పొట్టి హీరోయిన్లు కావలెను

ఈ మధ్య ఉన్న హీరోయిన్లు బాగా బిజీగా ఉండటంతో... కొత్తవారికోసం నిర్మాతలు అన్వేషణ మొదలుపెట్టారు. ముంబై నుంచి దుబాయి నుంచీ లండన్ నుంచి... ఇలా దేశ విదేశాల నుంచి ఎన్నో ప్రొఫైల్స్ ప్రముఖ నిర్మాణ సంస్థలకు చేరుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఆయా నిర్మాణ సంస్థలు కొత్త హీరోయిన్ల విషయంలో ముందుగా చూస్తున్నది ఏంటంటే... ఎత్తు. అమ్మాయిల ఎత్తు మరీ ఆరు అడుగులు ఉంటే కష్టమంటున్నారు. ఓ ఐదూ ఐదున్నర మధ్యలో ఉంటే మేలంటున్నారు. కారణం ఏంటంటే... మన యువ హీరోల్లో ఒకరిద్దరు తప్ప బాగా హైట్ ఉన్నవారు ఎవరూ లేరు. అందుకే, ఇప్పుడున్న చాలామంది హీరోయిన్లు వాళ్ల పక్కన అక్కలానో పిన్నిలానో కన్పిస్తారని వాళ్లతో సినిమాలు మానుకున్నారు. కాబట్టి వాళ్లకు సరిపోయేట్టుగా కాస్త పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఉంటే బెటర్ అని వెతుకులాడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: