అయ్యయ్యో.. డార్లింగ్ ప్రభాస్ సినిమా అందుకే లేట్ అవుతోందా..

savitri shivaleela
బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఈ రెబల్ స్టార్ కు అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. ఇదిలా ఉంటే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి, దీపికా పదుకొనె లు కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసుకునే పనిలో పడింది.
 ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెళ్లడించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ‘ఇలాంటి కథ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఒక వేళ వస్తే అది వరల్డ్ సినిమాలో తీసి ఉండొచ్చు. కానీ ఇండియాలో మాత్రం ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఇది కొత్తగా ఉండటంతో మా యూనిట్ కు కాస్త అర్థం అవడం లేదు. అందుకే మేమంతా నేర్చుకోవడం ప్రారంభించాం. నేర్చుకున్న తర్వాతే ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తాం.
అందుకే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం బాగానే పట్టేలా ఉందని’ వెళ్లడించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సమ్మర్ మధ్యలో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా వన్స్ స్టార్ట్ అయితే మధ్యలో ఆగే ప్రసక్తే ఉండదు. ఈ ఏడాది సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఇక ఈ మూవీ కోసం డార్లింగ్ కూడా ఎక్కువ డేట్స్ ను కేటాయించినట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: