ఓరి దేవుడా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పిట్టకథలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

savitri shivaleela
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరో చేతిలో ఉన్న పాన్ ఇండియా మూవీస్ మరే హీరో చేతిలో లేవు. ఈ హీరో కోసం బడా దర్శకులు కూడా క్యూలు కడుతున్నారు. ‘మహానటి’ ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ సినిమాలో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్  నిర్మించనున్న సంగతి తెలసిందే. ఇక భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. దీపిక పదుకునే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ప్రస్తుతం జరుపుకుంటోంది.
మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. అయితే ప్రస్తుతం ఓ అంథాలజీ సిరీస్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ‘పిట్టకథలు’ అనే తెలుగు అంథాలజీ సిరీస్ ను రూపొందించిన అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సిరీస్ ను టాలీవుడ్  దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి లు కలిసి ఈ సిరీస్ ను నాలుగు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వీరు డైరెక్టర్ చేసిన ఈ ఒరిజినల్ సిరీస్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే ఈ సిరీస్ తెలుగు లస్ట్ స్టోరీస్ స్టోరీస్ అంటూ ప్రచారం జోగురు సాగింది. అంతేకాకుండా ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.
అందులోనూ నాగ్ అశ్విన్ తీసిన ‘ఎక్స్ లైఫ్’ పై ఓ రేంజ్ ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వచ్చాయి. ఇక దీంతో ప్రభాస్ తో తెరకెక్కించే సినిమాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మూవీ కూడా ఈ సిరీస్ లాగే ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డైరెక్టర్ కు‘మహానటి’ సినిమా ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేని‘ఎక్స్ లైఫ్’తో అందరినీ నిరాశపరిచాడు. అందుకే ప్రభాస్ తో తియ్యబోయే సైన్స్ ఫిక్షన్ జోనర్ ఏ టాక్ తెచ్చుకుంటుందోనని డార్లింగ్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమా షూటింగులు పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: