జయం రవితో.. జి 5 లోకి ఎంటరైన కాజల్ అగర్వాల్.... సినిమా హిట్టా!! ఫట్టా!!

VAMSI
తమిళ సూపర్ స్టార్ జయం రవి... తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమ యువరాణి కాజల్ అగర్వాల్ వీరిద్దరూ కలిసి తాజాగా నటించిన చిత్రం "కోమలి". ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్ర దర్శకుడు. పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి ?  అన్నది ఈ చిత్ర కథాంశం. నేడు ఈ చిత్రం లాంఛనంగా జి 5 లో రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రంపై వస్తున్న టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 90వ దశకంలో పుట్టి పెరిగిన రవి హఠాత్తుగా ఓ ప్రమాదం వలన కోమాలోకి వెళతాడు.
 దాదాపు 16 ఏళ్ల తర్వాత రవి తిరిగి కోమాలో నుంచి మేల్కొంటాడు. కానీ అప్పటికే కాలంతో పాటు తన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో రవి ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కొంటాడు .... అతడికి తోడుగా కాజల్ అగర్వాల్ ఎలా తన పాత్రను పోషిస్తుంది అనేది కథ మొత్తానికి కోమలి ఒక ఆసక్తికరమైన కథాంశం ఉన్న సరదా సినిమా అని తెచ్చుకుంటోంది. కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. జయం రవి నటన అదుర్స్ అని చెబుతున్నారు.
 కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంతో హైలెట్ గా నిలిస్తే.... సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కువయి కొన్నిచోట్ల బోరింగ్ గా ఉన్నట్లు చెబుతున్నారు... కానీ హీరో రవి నటన తో వాటిని కూడా బాలెన్స్ చేశాడట. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రను అద్భుతంగా పోషించారట.... ముఖ్యంగా హాస్యనటుడు యోగి బాబు  ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాడు. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకునే  సినిమాగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: