బాబాయికోరికను తీర్చబోతున్న చరణ్ !

Seetha Sailaja
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయి నాగబాబు కోరికను తీర్చడానికి అంగీకరించాడు అనే వార్తలు వస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గొల్లభామ’ సినిమాలో కనీసం కొన్ని సెకండ్స్ అయినా చరణ్ ‘గొల్లభామ’ లో కనిపిస్తే బాగుంటుందని నాగబాబు కోరికట. ఇప్పటికే అల్లుఅర్జున్ ఈ సినిమాలో వచ్చే క్లైమేక్స్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాకు మరింత క్రేజ్ ను తెచ్చే ఉద్దేశ్యంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ఇంటర్వెల్ పార్ట్ కు ముందు ఈ సినిమా హీరో వరుణ్ తేజ్ ఆడుతున్న వాలీబాల్ గేమ్ ను చూసి ‘ఎవరు ఇతను ఎంత బాగా ఆడుతున్నాడు’ అనే డైలాగ్ ను చరణ్ చేత చెప్పిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి నాగబాబుకు చెపితే ఈ ఆలోచన బాగా నచ్చిన నాగబాబు ఈ విషయాన్ని చరణ్ దృష్టికి తీసుకువెళ్ళాడు అని టాక్. ఈ ఆలోచన చరణ్ కూడ ఓకె చేయడంతో ‘గొల్లభామ’ సినిమాలో ఒకేఒక్క సీన్ లో అలా కనిపించి ఈ డైలాగ్ చెప్పడానికి చెర్రీ అంగీకరించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో ప్రస్తుతానికి తెలియకపోయినా అటు చరణ్ ఇటు బన్నీలు వరుణ్ తేజ్ సినిమాలో కనిపిస్తే ఇక మెగా కుటుంబ అభిమానులకు పండుగనే అనుకోవాలి. ‘మనం’ లో అక్కినేని కుటుంబ హీరోలంతా కనిపిస్తే ‘గొల్లభామ’ లో మెగా వారసులు అంతా ఒకే సినిమాలో కనిపిస్తూ ఆ సినిమా క్రేజ్ ను పెంచుతారు కాబోలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: