ఇండస్ట్రీకి హీరోల కూతుళ్ల ఎంట్రీ.. ఎంత మందో తెలుసా..?

Kothuru Ram Kumar
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోల కూతుళ్లు ఎంట్రీకి అభిమానులు ఒప్పుకునే వాళ్లు కాదు. సినిమా హిట్ కాకపోతే స్టార్ హీరోల పేరు, సంపాదించిన ఇమేజ్ మొత్తం పోతుందని అభిమానులు భయపడేవాళ్లు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజూల ఎంట్రీకి కూడా చాలా అడ్డంకులు వచ్చాయి. టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం భిన్నంగా ఉంది. అప్పటికాలం నుంచి స్టార్ హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
టాలీవుడ్ లో కూడా కల్చర్ మారింది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ హీరోలు మోహన్ బాబు, రాజేష్, రాజశేఖర్, నాగబాబులతో పాటు చాలా మంది హీరోలు తమ కూతుళ్లకు ఎంట్రీ ఇప్పించారు. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా నటించిన సినిమా సూర్యకాంతం కమర్షియల్ హిట్ ను అందుకుంది. హీరో మోహనబాబు కూతురు మంచు లక్ష్మీ ఇప్పటికే చాలా సినిమాలు తీశారు. కొన్ని సక్సెస్ అందుకున్న మరికొన్ని పరాజయం పొందాయి. డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురితో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దొరసాని సినిమాలో నటించారు. స్టార్ హీరో కమల్ హాసన్ కూతులు శ్రుతిహాసన్ కూడా అగ్ర హీరోయిన్ల సరసన చేరారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్లు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అగ్రహీరో ధర్మేంద్ర, హేమామాలినిల ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ చిన్నకూతురు కరీనా కపూర్ టాప్ హీరోయిన్ గా మారింది. పెద్ద కూతురు కరిష్మా కపూర్ సైతం టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా సినిమాల్లో రాణించి స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను వివాహం చేసుకుంది. ట్వింకిల్ చెల్లెలు రింకీ కన్నా కూడా కొన్ని సినిమాల్లోనటించింది.
వీరితోపాటు స్టార్ హీరో జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మంచి పేరును సంపాదించకున్నారు. బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా అగ్ర హీరోయిన్ గా సరసన నిలిచింది. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, శక్తి కపూర్ కూతురు శ్రద్ధా కపూర్, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: