బాలు నుంచి జాలు వారిన ఆ చివరి పాట..!

NAGARJUNA NAKKA
అద్భుతమైన స్వరం మూగబోయింది.ఆ గొంతునుంచి జాలువారిన వేల పాటలు మనకు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే ఆ మృదు మధుర గాత్రం నుంచి వచ్చిన చివరి పాట మాదంటే మాదంటూ ఎవరికి వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇంతకీ బాలు చివరి పాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గానగంధర్వుడు బాలు మరణంలో ఆయన పాటలపై  సంగీత ప్రపంచంలో కాస్త గట్టిగానే డిస్కషన్స్ జరుగుతున్నాయి. నవరస భరితంగా ఉండే  వేలపాటలకు మళ్లీ జనాల మదిలో మెదులుతున్నాయి. దీనికి తోడు బాలు చివరగా పాడిన పాటలపై కొందరు  క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. అలాంటి వారిలో ముందుగా మనకు కనిపించేది రఘుకుంచె. సొంత సినిమా " పలాస 1978"లో ఓ సొగసరి అంటూ సాగే పాటను బాలునే ఆలపించారు.
టెక్నికల్ గా చూసుకున్నప్పుడు సినిమా పాటల పరంగా తెలుగులో ఇది చివరిది కావచ్చు. బట్ బాలు ఈ పాటను రఘుకుంచె కోరిక మేరకు డేట్స్ ఇష్యూ వస్తాయని తెలిసి ఎప్పుడో  పాడటం జరిగింది. ఈ పాట తర్వాత  డిస్కోరాజా వింటేజ్ స్టయిల్ సాంగ్  ను  ఆలపించడం జరిగింది. పలాస కంటే రవితేజ సినిమా ముందుగానే రిలీజ్ కావడంతో ఆ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోలేకపోతుంది.
నిజానికి  గానగంధర్వుడి చివరి పాటలు రజనీకాంత్ కోసమే  పాడినవని ఎంతమందికి తెలుసు. దర్బార్ లోని టైటిల్ సాంగ్ బాలు పాడిందే. అలాగే సెట్స్ మీదున్న రజనీ ఫిలిం "అన్నాత్తై" కోసం  బాలు పాడిన పాటను ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ దీపావళికి రావల్సిన అన్నాత్తై సినిమా...కరోనా ఎఫెక్ట్ తో షూట్ లేట్ చేసుకుంటూ వచ్చింది. అన్నీ వర్కవుట్ అయితే 2021 సంక్రాంతి కానుకగా వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం బాలు చివరి పాట ఇదే కావచ్చు. ఆ పాట ఎలా ఉందో అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: