కియరా లస్ట్ స్టోరీస్ రేంజ్ లో కాజల్ వెబ్ సీరీస్.. కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..!

shami
దీపం ఉండగానే ఇల్లు సర్ధుకోవాలన్నది పాత సామెతే అయినా ఇది హీరోయిన్స్ విషయంలో చెబితే.. క్రేజ్ ఉన్నప్పుడే కాస్త కూస్తో చేతినిండా సంపాదించేయాలి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. తమకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలోనే ఉంటారు. కాంబినేషన్స్, హీరోలు, కథలు ఇవేవి కాదు టెంప్ట్ చేసే రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఎలాంటి సినిమాలైనా చేసేస్తున్నారు. ఇక ఇదే తరహాలో చందమామ కాజల్ ఇప్పుడు కెరియర్ లో కొత్త స్టెప్ తీసుకుంటుంది.  
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న కాజల్ గ్లామర్ షో విషయంలో హద్ధులు దాటలేదు. కాజల్ బికిని షో లాంటివి అసలు చేయలేదు. ఉన్నంతలో హాట్ గా కనిపిస్తూ అలరించింది. ఇక ఇదిలాఉంటే అమ్మడు ఇప్పుడు సినిమాలకే కాదు వెబ్ సీరీస్ కు సై అనేస్తుంది. కియరా లస్ట్ స్టోరీస్ తరహాలో కాజల్ కూడా ఓ అడల్ట్ వెబ్ సీరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో కాజల్ హాట్ హాట్ గా కనిపిస్తుందట.    
సినిమాల్లో రెచ్చిపోని కాజల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద మాత్రం హాట్ షోకి సిద్ధమైంది. వెబ్ సీరీస్ ల కోసం కాజల్ బికిని ట్రీట్ కు సిద్ధమైందని అంటున్నారు. ఇన్నాళ్ళు దాచిపెట్టిన అందాలన్ని వెబ్ సీరీస్ లో బహిర్గతం చేస్తుందట. ఎలాగు కెరియర్ లో ఛాన్సులు తగ్గడంతో ఈ వెబ్ సీరీస్ తో ఎలాగైనా అమ్మడు అదరగొట్టాలని చూస్తుంది. కాజల్ చేస్తున్న ఈ హాట్ షో ఆమెకు ఏ రేంజ్ క్రేజ్ తెస్తుందో చూడాలి.                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: