అపుడే సెకండ్ గ్రేడ్ బ్యూటీస్ అయిపోయారా..!

NAGARJUNA NAKKA
దక్షిణాది అందాల ముద్దుగుమ్మలకు లీడింగ్ రోల్స్ చేసే కాలం చెల్లిపోతోంది. టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న చాలామంది భామలకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. ఎవరికి వారు తమకొచ్చే రోల్స్  ఏంటనే దానిపైనే ఎక్కువగా సిట్టింగ్ లు పెడుతున్నారట. ఇప్పుడీ సమస్య టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఎంటైర్ సౌత్ అంతా అంటుకుంది.
క్యూట్ గాళ్ కాజల్ నే తీసుకుందాం. మొన్నటివరకు లీడ్ భామగా మెరుపులు మెరిపించింది. ఆ తర్వాత స్పెషల్ రోల్స్ లేదంటే స్పెషల్ సాంగ్స్ లు చేసి తళుక్కుమనేది. ఇప్పుడా ఛాన్స్ కూడా కాజల్ కు దక్కకుండా పోతుంది. ప్రస్తుతానికి ‘ముంబై సాగా, ఇండియన్ 2’ చిత్రాలు చేస్తుంది. ఇందులో ఇండియన్ 2లో హీరోయిన్ గా  సెకండ్ లీడ్ చేస్తుంది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో కూడా నటిస్తోంది. ఇందులోనూ  అంత ఆశించినంత పాత్రకాదని తెలుస్తుంది. అక్కడితో ఆగకుండా ఇళయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలోను రెండో కథానాయికగా కాజల్ ను తీసుకున్నారు. అంటే ఎటు చూసినా కాజల్ సెకండ్ హీరోయిన్ రోల్ తోనే సంతృప్తి పడాల్సి వస్తుంది.
కాజల్ కంటే పరిశ్రమకు లేటుగా వచ్చి నిన్నటి వరకు లీడ్ హీరోయిన్ గా చేసినా రకుల్ పరిస్థితి ఇలానే ఉంది. ఈమె   ఇండియన్ 2 లో సెకండ్ హీరోయిన్ గా దర్శనమివ్వనున్నారు. ఇక రాశిఖన్నా అయితే బెంగాల్ టైగర్ తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్ చేయకపోయినా.. కోలీవుడ్ నుంచి అలాంటి ఆఫర్సే వస్తుండడంతో తెగ బాధపడిపోతుందట. క్యాథరీన్ ,అను ఇమ్మానుయేల్, నివేదాథామస్ లు సెకండ్ లీడ్ ను షేర్ చేసుకునే పొజిషన్ కు వచ్చేశారు. వీరెవరికి లీడ్ రోల్స్ కంటిన్యూగా రావడం లేదు. అనుకోకుండా వచ్చి పడిన కొందరు కన్నడ,మళయాల బ్యూటీలు...వీరికొచ్చే లీడ్ రోల్ కు ఎసరు పెట్టేస్తున్నారు.దీంతో కాంప్రమైజ్ పాలసీతో కాలం వెళ్లదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: