వేదం సినిమాలో అనాథగా నటించి ప్రేక్షకులను ఫిదా చేసిన అల్లు అర్జున్..!

Kothuru Ram Kumar

2010 జూన్ 4వ తేదీన విడుదలైన వేదం సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్, దీక్షాసేథ్, అనుష్క, నాగయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మొత్తం ఐదు భిన్నమైన కథలను అద్భుతంగా చూపించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. గమ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా సుపరిచితమైన రాధాకృష్ణ జాగర్లమూడి తన రెండవ సినిమా అయిన వేదం తో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే ఫిలింనగర్ లో కేబుల్ ఆపరేటర్ గా పని చేసే కేబుల్ రాజు(అల్లు అర్జున్) ఒక అనాథ. అతడి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే చనిపోతారు. దీంతో తాను ఒక అనాథ అవుతాడు. అయితే తన అమ్మమ్మ అతడిని చేరదీసి పెంచిపెద్ద చేస్తోంది. 


అతడు ఒక పేదవాడైనా ... తాను ఒక ధనిక కుటుంబంలో పుట్టిన వాడినని అబద్ధం చెప్పి పూజ అనే ఒక ధనిక అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. అయితే పూజ న్యూ ఇయర్ ఈవెనింగ్ పార్టీకి వెళ్లదామని అతడికి చెప్పి రూ. 40,000 ఎంట్రీ టికెట్ కొనమని చెబుతుంది. దీంతో కటిక పేదరికం లో ఉన్న కేబుల్ రాజు డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా 40 వేల రూపాయలు సంపాదించలేక పోతాడు. చివరకి బంగారపు చైన్ దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడతాడు. 


ఆ తర్వాత కేబుల్ రాజు ఒకరి సహాయం తో జైలు నుండి బయటకు వస్తాడు. తన మనవడు దొంగతనం చేశాడని తెలుసుకున్న అమ్మమ్మ అతడికి చీవాట్లు పెట్టి మూడు వేల రూపాయలు ఇస్తుంది. ఆ మూడు వేల రూపాయలు తీసుకొని కాఫీ షాప్ కి వెళ్ళిన కేబుల్ రాజు కి రాములు(నాగయ్య) అనే ఒక వృద్ధుడు కనిపిస్తాడు. ఆ వృద్ధుడి చేతిలో డబ్బులు ఉండటం గమనిస్తాడు కేబుల్ రాజు. ఆ వృద్ధుడిని అనుసరించి చివరికి ఆ డబ్బు సంచిని దొంగిలిస్తాడు. తదనంతరం న్యూ ఇయర్ పార్టీ కి ఎంట్రీ ఫీజు కట్టేందుకు కేబుల్ రాజు వెళ్తాడు కానీ చివరికి తాను చేసిన తప్పును తెలుసుకుని ఆ డబ్బు సంచిని తిరిగి రాములుకి ఇచ్చేస్తాడు. అయితే అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో చాలా సహజంగా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఒక అనాథ పాత్రలో అల్లు అర్జున్ చూపించిన నటన ప్రదర్శనకు విమర్శకుల సైతం ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: