గాల్వన్ లోయ ఘటనపై  సినిమా ..

గత నెల 15న లడఖ్ లోని గాల్వన్ లోయ వద్ద భారత్ - చైనా భద్రతాదళాల మధ్య జరిగిన ఘర్షణ లో 20మంది భారత సైనికులు వీర మరణం పొందగా వీరిలో తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్  బాబు కూడా వున్నారు. ఈఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటన లో అటు చైనా నుండి కూడా దాదాపు 43మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక గాల్వన్ వ్యాలీ ఘటన ఆదారంగా త్వరలోనే సినిమా రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ,సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్ఎల్ పి అనే నిర్మాణ సంస్థ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈసినిమాకు నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులను ఎంపిక చేయాల్సివుంది. 
ఇక ఇదిలావుంటే అజయ్ దేవగణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మైదాన్ వచ్చే ఏడాది ఆగస్టు13న విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రం ఫుట్బాల్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించాల్సివుంది కానీ అనివార్యకారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ప్రియమణిని తీసుకున్నారు. హిందీతోపాటు ,తెలుగు, తమిళ , మలయాళ భాషల్లో మైదాన్ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: