పోలీస్ ఆఫీసర్ గా ఒదిగిపోయిన‌ గోపీచంద్..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా చిత్ర ప‌రివ్ర‌మ‌లో పోలీస్ పాత్ర‌కు ఉన్న క్రేజ్ మ‌రేపాత్ర‌కు లేద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా తెలుగు తెర‌పై ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్ములా పోలీస్ క్యారెక్టర్. అందుకే ఎవరైనా దర్శకుడు పవర్ఫుల్ పోలీస్ పాత్రను, దానికి తగిన మంచి కథను చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకొని మంచి హిట్స్ అందుకున్నారు. అందులో హీరో గోపీచంద్ కూడా ఒక‌రు. తొలివలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. 

తర్వాత మళ్ళీ హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్‌. అయితే ఈయ‌న కూడా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. అందులో మొద‌టిది `ఆంధ్రుడు`. 2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో విడుదలైంది ఈ చిత్రం. ఇందులో గోపీచంద్, గౌరిపండిట్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ గోపీచంద్ మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడ‌ని చెప్పాలి. ఈ సినిమా మంచి విజ‌యం కూడా సాధించింది. ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ మ‌ళ్లీ పోలీస్ పాత్ర‌లో న‌టించిన సినిమా `శౌర్యం`.  

2008 లో జె. శివకుమార్ దర్శకత్వంలో విడుదలైంది ఈ సినిమా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో గోపీచంద్, అనుష్క హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఇక ఈ సినిమా త‌ర్వాత గోపీచంద్ `గోలీమార్` సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. 2010లో విడుదలైన ఈ సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేశ్ నిర్మించాడు. గోలీమార్ సినిమాలో గోపీచంద్ ముందు పోలీస్ ఆఫీసర్‌గా.. ఆ తర్వాత గంగూ భాయ్‌గా రెండు పాత్రలు చేసాడు. ఈ రెండు రోల్స్‌కు ప్రాణం పోసాడు ఈ యాక్షన్ హీరో. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ఒదిగిపోయిన తీరు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ఇక ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: