పోలీస్ పాత్రలో సూపర్ స్టార్.. ఆ సినిమా ప్రేక్షకుల ఆల్టైమ్ ఫేవరెట్..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు పోలీస్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోలు ఎవరైనా పోలీస్ పాత్రలో నటిస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతాయి.. అదే ఎప్పుడు నటించిని  హీరో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు అంటే ఆ అంచనాలకు అసలు అదుపూ ఉండదు. ఇక అటు స్టార్ హీరోలు కూడా పోలీసు పాత్రల్లో  అసలుసిసలైన పోలీస్ పవర్ చూపించి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.ప్రస్తుతం ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఇలా పోలీస్ పాత్రలనూ చేసి మెప్పించిన వారే ఉన్నారు అని చెప్పాలి. 

 


 అయితే ఎంత మంది హీరోలు పోలీస్ పాత్రలో నటించినప్పటికీ... ఎంత ఇరగదీసినప్పటికీ మహేష్ బాబు నటించిన ఆ సినిమా మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది. ఆ సినిమా ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో  బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన పోకిరి సినిమా. పోకిరి సినిమా అంటే ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకుల్లో అదో  తెలియని క్రేజ్.  అయితే ఈ సినిమాలో అప్పటి వరకు చూడని సరికొత్త కాన్సెప్ట్ అని తెలుగు ప్రేక్షకులు చూశారు. 

 

 ఈ సినిమాలో మొదటి నుంచి రౌడీ గా కనిపిస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇలా రౌడీ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారిగా పోలీస్ అని తెలియడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి. ఇక మొట్టమొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో నటించడం కూడా ప్రేక్షకులను మరింత మెప్పించింది. ఇక పోలీస్ పాత్రలో మహేష్ బాబు నటన పీక్స్  అనే చెప్పాలి. ఇలా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో అద్భుతంగా రాణించి మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: