పోలీసుగా కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసిన సూర్య..!

Suma Kallamadi

జులై 5, 2013 వ సంవత్సరంలో విడుదలైన సింగం సినిమాలో తమిళ హీరో సూర్య, అనుష్క శెట్టి,  హన్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన యముడు చిత్రానికి సీక్వెల్. కానీ ఈ సినిమాలో పోలీసులకు మాత్రమే అన్ని సానుకూలంగా జరుగుతాయని, అతీతమైన శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ చూపించడం వలన యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సింగం సినిమాలో ధైర్యవంతుడైన నరసింహం పోలీస్ క్యారెక్టర్ లో నటించిన సూర్య 100% న్యాయం చేశాడు. అతడు ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు చాలా అందంగా కనిపిస్తుంది మరోవైపు ఉగ్రరూపం దాల్చి ప్రజలందరిని బాగా ఫిదా చేసేసాడు సూర్య. 

 


కాకినాడ లోని సముద్ర ప్రాంతంలో జరిగే కొన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ట్రాక్ చేసేందుకు నరసింహం రహస్య పోలీసుగా అవతారం ఎత్తాడు. తన పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేసినట్టు అందర్నీ నమ్మించి స్కూల్లో ఎన్సీసీ ఆఫీసర్ గా చేరుతాడు. తదనంతరం భయంకరమైన స్మగ్లింగ్ చేసే భాయ్( ముకేశ్ రిషి) కార్యకలాపాలపై నిఘా పెడతాడు. అలాగే వారు చేసే ప్రతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే పాఠశాలలో చదువుకునే సత్య అనే ఒక విద్యార్థిని  నరసింహం పై మనస్సు పారేసుకుంటుంది. అయితే సత్య బంధువు త్యాగరాజు భాయ్ కి శత్రువు గా మారతాడని నరసింహం తెలుసుకుంటాడు.

 


తదనంతరం వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి డిసిపి అవతారంలో కనిపిస్తాడు నరసింహం. ఆ తర్వాత ఏ అక్రమ కార్యకలాపాలకు ఆఫ్రికన్ వ్యక్తి కింగ్ పిన్ డాన్నీ బాస్ అని తెలుసుకుని అతడికి గుణపాఠం చెబుతాడు నరసింహం. ఐతే ఈ సన్నివేశాల్లో నరసింహం పాత్రలో నటించిన సూర్య అద్భుతమైన నటన చాతుర్యాన్ని దక్షిణాది ప్రేక్షకులను బాగా అలరించాడు. బాగా ఎమోషనల్ గా ఉండే సన్నివేశాల్లో హీరో సూర్య తన నటనా ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. పోలీస్ గా సూర్య చెప్పే డైలాగులు, ఉగ్రమైన నటన అందరిలో  ఉత్సాహాన్ని బాగా నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: