పోలీసు పాత్రలో అభిమానులను మెప్పించిన సూర్య..!

Kothuru Ram Kumar

సూర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం యముడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోకి పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేని దొరై సింగం తన తండ్రి మాటకోసం ఓ సబ్ ఇన్ స్పెక్టర్ గా మారతాడు. నిజాయితీగా బతకాలనుకున్న ఓ పోలీసు జీవితం పల్లె నుంచి వచ్చిన అతను నీతికి,నిజాయితీకి మారు పేరుగా పని చేస్తాడు.

 

 

ఈ సినిమాలో సెకెండాఫ్ లో ఓ పదిహేను నిముషాలపాటు ట్రిమ్ చేస్తే బావుండేది. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే డైలాగులు బాగానే పవర్ ఫుల్ గా రాసారు గానీ ప్రకాష్ రాజ్ సొంతు గొంతుతో డబ్బింగ్ చెప్పిస్తే ఇంకా పండేదనటంలో సందేహం లేదు. ఇదంతా ఒకెత్తు అయితే ఇది నిస్సందేహంగా సూర్య సినిమా. సినిమా మొత్తం తానై మోసాడు. ఈ చిత్రం సూర్యకు టైలర్ మేడ్ సబ్జెక్ట్ అనే కన్నా అతని టాలెంట్స్ కు ఓ ట్రైలర్ గా ఉందని అనటం సబబేమో.

 

 

అనూష్క కేవలం పాటలకు పరిమితమైనా అంతకు మించి కథకు అనవసరమనే ఫిక్సయ్యేలా తీర్చిదిద్దారు. పల్లె జనం అంతా వచ్చి సూర్యకు సపోర్ట్ చేయటం, అదే విలన్ కు, హీరోకు మధ్య తగువుకి లీడ్ చేయటం అనే మంచి స్క్రిప్టు వర్క్ గా చెప్పవచ్చు. మైనస్ లలో చిత్రంలో అరవ అతి ఎక్కువ అవటం, హీరో కేకలు పెడుతూ డైలాగులుచెప్పటం కొంచెం ఇబ్బంది పెడతాయి.

 

 

అలాగే ఫైట్స్ కూడా ఒక్కోసారి సందర్భం పెద్దగా లేకపోయినా వచ్చేస్తూండటం విసుగిస్తుంది. టెక్నికల్ గా బారీ చిత్రాల స్ధాయిలో మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. హీరోయిజం వల్ల విలన్ సఫరయ్యే సీన్స్ బాగా పండాయి.అలాగే హీరోని కావాలని తనుండే సిటీకి ట్రాన్సఫర్ చేయించుకుని తన పతనాన్ని తానే తెచ్చుపెట్టుకోవటం కూడా వెరైటీగా ఉంది. పల్లె జనం అంతా వచ్చి సూర్యకు సపోర్ట్ చేయటం, అదే విలన్ కు, హీరోకు మధ్య తగువుకి లీడ్ చేయటం అనే మంచి స్క్రిప్టు వర్క్ గా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: