బాల‌య్య ఫ్యాక్ష‌నిస్టుగానే కాదు పోలీస్‌గానూ ' ల‌క్ష్మీ న‌ర‌సింహా ' మే...!

VUYYURU SUBHASH

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాక్ష‌న్ క‌థ‌లో న‌టిస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య ప‌వ‌ర్ ఫ్యాక్ష‌న్ క‌థ‌ల‌లో న‌టించి ఆ సినిమా టైటిల్లో సింహం అనే ప‌దం ఉంటూ సినిమా బ్లాక్ బ‌స్ట‌రే.. బాల‌య్య న‌ట‌న‌తో  వీర విజృంభ‌ణ చేయ‌డ‌మే మిగిలి ఉంటుంది. స‌మ‌ర‌సింహా రెడ్డి, న‌ర‌సింహా నాయుడు, సీమ సింహం ఇలా అన్ని సినిమాలు కూడా ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా టైటిల్లో సింహా అనే ప‌దం ఉండ‌డం బాల‌య్య‌కు క‌లిసి వ‌చ్చింది. చివ‌ర‌కు సింహా సినిమాలోనూ అదే సింహా ప‌దం ఉంది. 

 

అయితే ఫ్యాక్ష‌న్ క‌థ కాకుండా బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించిన సినిమా ల‌క్ష్మీ న‌ర‌సింహా. 2004 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. అప్ప‌టికే కోలీవుడ్‌లో విక్ర‌మ్ హీరోగా న‌టించిన సామీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌చ్చింది. జ‌యంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆశిన్ హీరోయిన్‌. మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. సినిమాలో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు, యాక్ష‌న్‌, ఆశిన్‌తో రొమాన్స్‌, పాట‌లు, డ్యాన్సులు, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అన్ని హైలెట్ అయ్యాయి.

 

బెల్లంకొండ సురేష్ నిర్మాత‌. ముఖ్యంగా బాల‌య్య - కృష్ణ భ‌గ‌వాన్ కామెడీ స‌న్నివేశాలు, బాల‌య్య - విల‌న్ ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య వ‌చ్చే సీన్లు హైలెట్ అయ్యాయి. క‌థ విష‌యానికి వ‌స్తే బాల‌య్య ఒక నిజాయితీ క‌ల పోలీస్ ఆఫీస‌ర్‌గా చేయ‌డంతో పాటు నేర‌గాళ్ల‌ను అణిచి వేసేందుకు ఒక్కోసారి చ‌ట్టం ప‌రిధి దాటి ముందుకు వెళ‌తాడు. ఏ ధ‌ర్మ‌భిక్షం ( ప్ర‌కాష్ రాజ్‌) వ‌ల్ల త‌న కుటుంబం నాశ‌నం అయ్యిందే అదే ధ‌ర్మ‌భిక్షంతో తెలివిగా ఆడి చివ‌ర‌కు చెక్ పెడ‌తాడు. ఈ సినిమా ఆద్యంత ఆస‌క్తి సాగుతుంది. అప్ప‌ట్లో సంక్రాంతికి చిరంజీవి అంజి, ప్ర‌భాస్ వ‌ర్షం సినిమాలు పోటీగా వ‌చ్చినా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: