14 ఏళ్ల క్రితమే క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్.. కమల్ హాసన్ అదుర్స్..!

shami

క్రైం థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతుందని తెలిసిందే. అయితే 14 ఏళ్ల క్రితమే రాఘవన్ సినిమాతో క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశారు కమల్ హాసన్. ఆయన హీరోగా గౌతం వాసుదేవ మీనన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రాఘవన్. తమిళ వెట్టైయాడు విలైయాడు తమిళ సినిమాను తెలుగులో డబ్ చేసి రాఘవన్ అని రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ కూతురు మిసింగ్ కేస్ డీల్ చేసే డిసిపి రోల్ లో కమల్ హాసన్ కనిపించారు. 

 

తప్పిపోయిన అమ్మాయి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటి విలన్స్ వాళ్ల ఇంటికి పంపిస్తూ ఓ భయాదోళణకు గురి చేస్తారు. అయితే ఎలాంటి క్లూస్ లేకుండా చేసిన ఆ మర్డర్ ను ఎలా కనిపెట్టి రాఘవన్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ. రాఘవన్ టేకింగ్, కమల్ హాసన్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 2006లో రిలీజైన ఈ సినిమా కమ్రర్షియల్ గా కూడా సూపర్ హిట్ అందుకుంది.

 

ఎలాంటి పాత్రలో అయినా కూడా మెప్పించే కమల్ హాసన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కమల్ వేసే ఎత్తులు, పై ఎత్తులు సూపర్ గా ఉంటాయి. 14 ఏళ్ల క్రితమే క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కమల్ హాసన్ చేసిన రాఘవన్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఇలాంటి క్రైం థ్రిల్లర్ మూవీస్ చాలా వస్తున్నాయి. రీసెంట్ గా విశ్వక్ సేన్ చేసిన హిట్ సినిమా కూడా ఈ జానర్ లో వచ్చిన సినిమానే. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. ఆడియెన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టే సస్పెన్స్ మెయింటైన్ చేయగలిగే సినిమాలు సూపర్ హిట్ కొడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: