బీచ్ లో మెగా హీరో రొమాన్స్

E. Rama Krishna
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన మరో మెగా హీరో వరుణ్ తేజ్. నాగబాబు తనయుడుగా వరుణ్ తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం అవుతున్నాడు. తను డెబ్యూగా వస్తున్న మూవీను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ మూవీకు సంబంధించిన అప్ డేట్స్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ గురించి ట్వీట్ చేశాడు. “అలెప్పీ బీచ్ లు తన జీవితంలో చుసిన మంచి బీచ్ లని, చాలా శుభ్రంగా కూడా వున్నాయని” వరుణ్ తేజ్ వివరించాడు. ఈ సినిమాలో గ్రామీణ నేపధ్యమున్న వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ కనిపించనున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్ గా చేస్తుంది. కేరళలో హీరో, హీరోయిన్స్ మీద కొన్ని రొమాంటిక్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ పై ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ అయ్యే కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. వరుణ్ తేజ్ నటిస్తున్న డెబ్యూ మూవీ సక్సెస్ ను అందుకుంటుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: