పవన్ కి అత్తగా నటించి పాపులర్ అయిన నదియా..!

Suma Kallamadi

 


2013 సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్, సమంత అక్కినేని, ప్రణీత, బోమన్ ఇరానీ, నదియా, రావు రమేష్ లతో పాటు చాలా మంది ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ డైలాగులు సమకూర్చి... దర్శకత్వం కూడా తానే వహించాడు. సినిమా కథ గురించి తెలుసుకుంటే కోట్ల అధిపతి రఘునందన్(బోమన్ ఇరానీ) వ్యాపార విషయాల్లో తన మనవడు ఐన గౌతమ్ నందన్(పవన్ కళ్యాణ్) చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటాడు. అయితే రఘునందన్ కూతురు సునంద (నదియా) తనకు ఇష్టమైన వ్యక్తి ని పెళ్లి చేసుకుంటుంది. కానీ తన అనుమతి తీసుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిందన్న కోపంతో రఘునందన్ ఆమెను ఇంటి నుంచి గెంటి వేస్తాడు. 

 


చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత రఘునందన్ తన కూతురి పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు. వెంటనే తన మనవడు ఐన గౌతమ్ నందన్ ని పిలిచి తన కూతురు ని తన వద్దకు తీసుకు రమ్మని చెబుతాడు. దీంతో గౌతమ్ నందన్ సునంద ఇంటికి ఆమెను తన కుటుంబానికి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. చివరికి ఆమెను ఎలాగోలా ఒప్పించి రఘునందన్ వద్దకు తీసుకెళ్తాడు. దీంతో సినిమా పూర్తవుతుంది. 

 


అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త క్యారెక్టర్ లో నటించిన నదియా చాలా సహజంగా నటించిందని చెప్పుకోవచ్చు. నటన పరంగా పవన్ కళ్యాణ్ తర్వాత నదియాకే ఎక్కువ మార్కులు పడ్డాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తదనంతరం ఆమెకు అనేకమైన సినీ అవకాశాలు వచ్చాయి. మిర్చి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించిన ఈమె అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. వాస్తవానికి నదియా గతంలో తమిళ తెలుగు మలయాళం చిత్రాలలో హీరోయిన్ గా చాలా కాలం కొనసాగింది. నాలుగు పదుల వయసు పైబడ్డ తర్వాత ఆమెకు హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లిపోగా... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తి ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీ కారణంగా నదియా అత్త క్యారెక్టర్ సూపర్ గా హిట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: