తమిళ హీరోలు తెలుగు మార్కెట్ కోసం చచ్చిపోతున్నారు గా...!

Gullapally Venkatesh

తెలుగులో సినిమాలకు ఉండే ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా సినిమా పిచ్చోళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. దాదాపు అందరు హీరోల అభిమానులు అన్ని సినిమాలు చూస్తారు. కనీసం విమర్శించడానికి అయినా సరే సినిమాకు వెళ్తారు అభిమానులు. దీనితో గత కొన్ని రోజులుగా మన తెలుగు హీరోలకు మార్కెట్ కూడా పెరిగిపోయింది. గతంలో సినిమా అంటే విడుదలైన తర్వాత రెండు మూడు రోజులు ఆగి చూడవచ్చులే అని భావించే వాళ్ళు... ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా లేదు. 

 

దాదాపు తమిళంలో కూడా ఈ విధంగానే అభిమానులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద గట్టి కన్నె వేసారట. సంక్రాంతి క్రేజ్ చూసిన కొందరు స్టార్ హీరోలు తెలుగులో తమ సినిమాలను కచ్చితంగా విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఇక్కడ సినిమా విడుదల అయితే సినిమా లాభాల్లో అగ్ర భాగం ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట వాళ్ళు. అందుకే ఇప్పుడు అవసరమైతే టాలివుడ్ స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. 

 

మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ హీరోలకు దగ్గర కావాలని చూస్తున్నారు. తమిళంలో మీ సినిమాల బాధ్యత మేము తీసుకుని ఆడిస్తాం అని... తెలుగులో మీరు మా బాధ్యత తీసుకుంటే లాభాల్లో కూడా వాటా ఇస్తామని చెప్పినట్టు సమాచారం. ఇక్కడి హీరోలతో సినిమా చెయ్యడానికి అవసరమైతే నిర్మాతలు గా కూడా మారాలని తమిళ స్టార్ హీరోలు భావిస్తున్నారు. ప్రధానంగా సూర్య, విశాల్, విజయ్ సహా కొందరు హీరోలు ఇప్పటికే కొందరు టాలివుడ్ అగ్ర హీరోలను సంప్రదించి పెట్టుబడులు కూడా పెడతామని చెప్పినట్టు సమాచారం.తమిళ సినిమా స్టార్ హీరోలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: