సెక్స్ కోసం నేను ఇండస్ట్రీకి రాలేదు... హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
రాధిక ఆప్టే ఎన్నో గ్లామర్ పాత్రల్లో మెరిసి ఎంతోమంది అభిమానులను తనవైపు తిప్పుకుంది.ఈ అమ్మడు సినిమాలతోనే కాదండోయ్ కాంట్రవర్సిలతో చాలామందికి కొసమెరుపు. ఈ అమ్మడు ఎప్పుడు కాంట్రవర్సి ట్విట్స్ పెడుతూ... కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే రాధిక ఆప్టే అంటే కేవలం నటిగానే మాత్రమే కాదు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు పేరుగా కూడా గుర్తొస్తూ ఉంటుంది అందరికీ. ప్రస్తుతం రాధిక అప్తే మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఈ అమ్మడు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. రక్త చరిత్ర లెజెండ్ లయన్ వంటి సినిమాలలో తెలుగు ప్రేక్షకులను కూడా తన అందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది ఈ అమ్మడు. తన అందంతో ఎంతోమందికి చెమటలు పట్టించింది.
ఎందుకంటే రాధిక ఆప్టే ఇప్పటివరకు ఎన్నో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మతి పోగొట్టింది. బద్లాపూర్ అహల్య లస్ట్ స్టోరీస్ వెడ్డింగ్ గెస్ట్ లాంటి సినిమాలో కూడా నగ్నంగా ఉండే పాత్రలో నటించింది ఈ అమ్మడు. అందాల ఆరబోతతో ఎంతో మంది ప్రేక్షకులకు చెమటలు పట్టించీ పగటి కలలు కనేలా చేసింది రాధిక ఆప్టే. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన రాధిక ఆప్టే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇటీవలే తన దగ్గరికి ఓ సినిమా కథ చెప్పడానికి ఓ దర్శకుడు వచ్చాడని... అందులో తనది వేశ్య పాత్ర అని ఆ దర్శకుడు చెప్పాడని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. అయితే ఎందుకు ఇలాంటి పాత్రలు చెబుతున్నావు అంటూ ఈ అమ్మడు దర్శకుని ప్రశ్నించగా... గత కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో నటించారు కాబట్టే ఇప్పుడు కూడా అలాంటి పాత్ర చేస్తారేమో అని ఈ కథను మీ వద్దకు తీసుకు వచ్చాను అంటూ దర్శకుడు చెప్పాడట. దీంతో దర్శకుడి జవాబుతో రాధిక ఆప్టే కాస్త షాక్ అయిందట.
దీంతో ఈ ముద్దుగుమ్మ కాస్త డైరెక్టర్ చెప్పిన సమాధానానికి షాక్ కి గురైందట. కాగా ఆ డైరెక్టర్ వినిపించిన కథను సున్నితంగా తిరస్కరించిదట ఈ అందాల భామ . అయితే ఇండియా సినిమాల్లోనే కాదు బయట సినిమాల్లో కూడా నగ్నంగా నటించడం తప్పు కాదు అంటుంది ఈ అమ్మడు. ముఖ్యంగా తనకు అలా నగ్నంగా కనిపించడంలో ఎలాంటి ఇబ్బంది కలిగించదు అని చెబుతుంది . తన బాడీతో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. అలా అని చెప్పి ఏదో ఒక తీసుకొచ్చి న్యూడ్ గా నటించమంటే తప్పేం లేదంటూ రాధిక ఆప్టే చెప్తుంది. సెక్స్ చేయడానికి మాత్రమే తాను ఇండస్ట్రీలోకి రాలేదని ఈ అమ్మడు అంటుంది.