అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటి..?

Kunchala Govind
అడల్ట్ కంటెంట్ సినిమాలలో నటించేందుకు బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకంటే మాములు కమర్షియల్ సినిమాలు నాలుగు చేస్తే వచ్చే పాపులారిటి ఒక్క అడల్ట్ సినిమాతో వచ్చేస్తుంది. అందుకు ఉదాహరణలు చాలా సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్. ఇక తెలుగులో అర్జున్ రెడ్డి , ఆర్.ఎక్స్ 100 వంటి సినిమాలు ఈ కోవకి చెందినవే. ఇక అడల్ట్ భూమి పెడ్నేకర్.. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతున్న టాప్ బ్యూటీ ఫుల్ హీరోయిన్. 

ఇటీవలే షార్ప్ షూటర్ సిస్టర్స్ చంద్రోతోమర్- ప్రకాషి తోమర్ ల బయోపిక్ సాంద్ కి ఆంఖ్ లో నటించి ఆకట్టుకుంది. భూమి-తాప్సీ కలిసి సిస్టర్స్ పాత్రల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈలోగానే భూమి పెడ్నేకర్ నటించిన పతి పత్ని ఔర్ వో అనే సినిమా కూడా రిలీజ్ కి సిద్దమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ భూమి లేటెస్ట్ ఫ్యాషన్స్ తో జనాలకు కైపెక్కిస్తోంది. ఇక అడల్ట్ కామెడీ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన పతి పత్ని ఔర్ వో పోస్టర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సెక్సిస్ట్.. ఆడా మగా వైరుధ్యం వంటి సీరియస్ టాపిక్స్ ని.. ఈ సినిమాలో ఎంతో ఫన్నీగా హ్యాండిల్ చేస్తున్నారు. 

ఇక ఇందులో భూమి  కార్తీక్ ఆర్యన్ భార్య పాత్రలో నటిస్తోంది. అనన్య పాండే ఆఫీస్ లో ఎఫైర్ పెట్టుకునే అమ్మాయిగా మరో డిఫ్రెంట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ సినిమాకి ముదసర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1978లో వచ్చిన పతి పత్ని ఔర్ వో క్లాసిక్ సినిమాకి ఈ సినిమా అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. భూమి పెడ్నేకర్ నటించిన బాలా కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా భూమి ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి భూమి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అవడానికి చాలానే కష్టపడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: