రాక్ స్టార్ కు భారీ షాక్ ఇచ్చిన కొరటాల....??

Mari Sithara
టాలీవుడ్ యువ సంగీత దర్శకుల్లో ప్రస్తుతం మంచి పేరుతో దూసుకుపోతున్న దేవిశ్రీ ప్రసాద్ గురించి మన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కొన్నాళ్ల క్రితం మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన హవాని దాదాపుగా పదేళ్లకు పైగా టాలీవుడ్ లో కొనసాగించారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్, మెల్లగా తన సంగీతంతో ప్రేక్షకులను అలరించ సాగారు. ఇక అక్కడినుండి ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ చిన్న హీరో దగ్గరి నుండి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల వరకు దాదాపుగా అందరితోను వరుస సినిమాలు చేసిన దేవిశ్రీకి, ఇటీవల మరొక సంగీత దర్శకుడు థమన్ ఎంతో గట్టి పోటీని ఇస్తున్నారు. 

అంతేకాక ఇండస్ట్రీకి సరికొత్త సంగీత దర్శకుల రాక కూడా దేవి వంటి వారికి మెల్లగా అవకాశాలు తగ్గేలా చేస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే తన తొలి సినిమా మిర్చి నుండి మొన్నటి భరత్ అనే నేను వరకు, తన సినిమాలన్నిటికీ కూడా దేవిశ్రీప్రసాద్ నే తీసుకునే కొరటాల శివ, అతి త్వరలో మెగాస్టార్ తో తెరకెక్కించనున్న తాజా సినిమా కోసం ఆయనను ప్రక్కన పెట్టినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. నిన్న ఎంతో ఘనంగా ప్రారంభమైన మెగాస్టార్ మరియు కొరటాల సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే దానిపై మాత్రం నిర్మాత, 

దర్శకులు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ సినిమాకు దేవిని కాకుండా వేరొక సంగీత దర్శకుడిని తీసుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దేవిశ్రీకి ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో ఈ సినిమా కోసం ఆయన బదులుగా వేరొక సంగీత దర్శకుడిని తీసుకునేలా ఆలోచన చేస్తున్నారట. అంతేకాక ఇటీవల మెగాస్టార్ తో సైరా సినిమాకు సంగీతం అందించిన అమిత్ త్రివేదినే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే కొరటాల శివ , దేవిశ్రీ కి పెద్ద షాక్ ఇచ్చినట్లేగా మరి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: