బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న యంగ్ హీరో సినిమా

తమిళ హీరో  జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ  కోమలి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.  ఈనెల 15న  విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో  కేవలం 6రోజుల్లోనే 25కోట్ల  వసూళ్లను  రాబట్టిందని సమాచారం.  అజిత్ నటించిన  నెర్కొండ పరవాయ్  తో పోటీ ని తట్టు కొని ఈచిత్రం  దీటుగా వసూళ్లను రాబడుతుంది.  ఇటీవల  ఈసినిమా ట్రైలర్ వివాదాలకు దారి తీయడంతో సినిమా విడుదలకు ముందే మంచి హైప్ వచ్చింది. ఇక  ప్రభాస్ నటించిన సాహో  విడుదలైయ్యేవరకు  ఈ సినిమా జోరు  కొనసాగనుంది. 



కాగా   యూఎస్ లో  అతి తక్కువ  లొకేషన్లలో  విడుదలైన  ఈ చిత్రం  మంచి మౌత్ టాక్ తో  అక్కడ కూడా  పర్వాలేదనే  వసూళ్లను  రాబడుతూ  విజయం దిశగా  పయనిస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్  నేపథ్యంలో ప్రశాంత్ రంగరాజన్  తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్  అగర్వాల్ కథానాయికగా నటించగా  యోగి బాబు , కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు.  హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన  ఈ చిత్రాన్ని వేల్స్  ఫిలిం ఇంటర్ నేషనల్స్  నిర్మించింది. 




ఇక ఇటీవల  వరుస సినిమాలతో హిట్లు కొడుతూ దూసుకుపోతున్న  జయం రవి తాజాగా  ఈ కోమలి తో  వరుసగా హ్యాట్రిక్ విజయాలను  నమోదు చేశాడు. ఇంతకుముందు ఆయన నటించిన టిక్ టిక్ టిక్ , అడంగ మారు  కూడా సూపర్ హిట్ అయ్యాయి.    ఇక ఈ కోమలి తరువాత  జయం రవి , జన గణ మణ అనే సినిమాలో నటించనున్నాడు.  ఆహ్మద్ తెరకెక్కించనున్న ఈచిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాప్సి  హీరోయిన్ గా నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: