యంగ్ డైరక్టర్ నిర్మాణంలో కీర్తి సురేష్

మహానటి చిత్రానికి గాను  ఇటీవల ఉత్తమ నటి విభాగంలో  జాతీయ అవార్డు ను గెలుచుకున్న  రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫై ప్రశంసల వర్షం కురుస్తుంది.  ఇక ఈ అవార్డు తో కీర్తి ఆనందానికి అవధులు లేవు.  కాగా తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కీర్తి  సురేష్ తన తదుపరి చిత్రాన్ని పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు నిర్మించనున్నాడని వెల్లడించింది.  ఓ  నూతన దర్శకుడు  డైరెక్ట్ చేయనున్న ఈచిత్రం కూడా  లేడీ ఓరియేంటేడ్ మూవీ నే కావడం విశేషం.  త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి. 


ఇక  కీర్తి సురేష్  ప్రస్తుతం  తెలుగులో  రెండు సినిమాలకు అలాగే హిందీలో  ఓ చిత్రానికి సైన్ చేసింది. అందులో భాగంగా ఆమె   ప్రస్తుతం  తెలుగులో  నరేంద్ర డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంట్డ్ మూవీ లో నటిస్తుండగా .. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.  మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలకానుంది.  ఈ సినిమాతోపాటూ కీర్తి  నగేష్ కుకునూరు డైరెక్షన్లో ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తుందిఆదిపినిశెట్టి  మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా  జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 


ఇక వీటితోపాటు  హిందీలో  అజయ్ దేవగన్  సరసన నటించడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీర్తి సురేష్.  బడాయి హో ఫేమ్ అమిత్ శర్మ  డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా కీర్తి కి బాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: