హిట్టిచ్చినా....అక్కడే హీటంట.. !!

Satya
హిట్లు పట్లు ఎవరి చేతులలో ఉండవు. ఎంత బాగా మూవీ తీసినా కూడా ఆడియన్స్ నో అనేస్తే చాలు ఆ బొమ్మ తిరగబడిపోతుంది. కష్టం, కాలం, కాసులు అన్నీ గంగలో కలుస్తాయి. అయితే  ఒకటి తరువాత మరొకటి తీసి అయినా హిట్ కొట్టాలంటే కొందరికే సాధ్యం. ఎందుకంటే ఇది విచిత్ర సీమ కాబట్టి.


ఇదిలా ఉంటే హిట్టుతోనే టాలీవుడ్లో అడుగు పెట్టిన కొందరు ముద్దు గుమ్మలు ఇపుడు ఎలాంటి ఆఫర్లు లేక సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. నాడు యూత్ ని వెండి తెర మీద షేక్ చేసిన ఈ అందాల బొమ్మలు నేడు తామే షాక్ తింటున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్యా త్రిపాఠి ఇపుడు ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టేసింది. ఆ తరువాత స్టార్ హీరో నాగ్ తో సోగ్గాడే చిన్ని నాయనలో మెరిసింది. అక్కడ నుంచి ఫ్లాపుల కధ మొదలైంది. ఇపుడు చేతిలో ఒక్క నిఖిల్ అర్జున్ సురవరం మూవీ మాత్రమే ఉంది. అది హిట్ అయినా ఆఫర్లు వచ్చే చాన్సే లేదు.


హెబ్బా పటేల్ కూడా అంతే హిట్టు కొట్టి తాను ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడికి ఇపుడు సినిమాలే లేవు. బోల్డ్ గా యాక్ట్ చేసే ఈ గ్లామర్ కి ఆఫర్లు లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెట్టి తెగ హీటెక్కించేస్తోంది. ఒక కంచె మూవీతో అందాలను  కంచె దాటించిన ప్రగ్యా జైస్వాల్ కి కూడా సినిమాలు లేవు. ఆమె సైతం సోషల్ మీడియాలో కుర్ర కారు మతి పోగొడుతోంది. ఇదే పరిస్థితి మరో అర డజన్ మంది హీరోయిన్లకు ఉంది. వెండి తెర మీద వెలిగిపోవాలనుకుంటున్న వీరికి లక్కు అలా వెక్కిరించడం వల్లనే అందం, అభినయం ఉన్నా కూడా చాన్సులు రావడంలేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: