సీనియర్లూ... కుర్ర భామలు...!!

Satya
హీరో వయసు అరవై. హీరోయిన్ వయసు పదహారు. ఈ జోడీ ఎప్పటి నుంచే టాలీవుడ్లో అలవాటు అయిపోయిన ముచ్చటే. అన్న నందమూరి తారక రామారావు అరవై ప్రాయానికి చేరువైన వేళ ఆయన మనవరాలి వయసు ఉన్న శ్రీదేవి పక్కన జంటగా నటించి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఏకంగా శ్రీదేవి. ఎంటీయార్ కలసి 12 సినిమాలు చేశారంటే ఈ జోడీకి జనం నీరాజనం పట్టారన్నది తెలుస్తూనే ఉంది. అలాగే అక్కినేని పక్కన కూడా శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి వారు నటించి వయసు తో సంబంధం లేదని నిరూపించారు.


ఇపుడు చూస్తే టాలీవుడ్ల టాప్ ఫోర్ సీనియర్ హీరోలు అరవై పడిలోనే ఉన్నారు. వారంతా ఇపుడు కుర్ర భామలతో ఆడుతూ పాడుతూ మళ్లీ నాటి ముచ్చటను గుర్తుకు తెస్తున్నారు. ఈ మధ్యనే వెంకటేష్ ఎఫ్ 2 మూవీలో మిల్కీ బేబీ తమన్నాతో నటించి బంపర్ హిట్ కొట్టాడు. ఈ జంట వెండి తెరకు కన్నుల పంట అయింది. ఇక తమన్నాతో మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా  మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఆ తరువాత కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి నటించే మూవీలోనూ తమన్నా సెలెక్ట్ అయింది.


ఇపుడు బాలయ్య వంతు. ఆయన కూడా కుర్ర భామల వెంట పడుతున్నారు. బోయపాటి బాలయ్య మొవీలో రకుల్ ప్రీత్ సింగ్, శ్రధ్ధా శ్రీనాధ్ అనే ఇద్దరు పడుచు భామలు జోడీ కడుతున్నారు. బాలయ్యతో తమన్నా, కాజల్ వంటి వారు కూడా రాబోయే మూవీస్ లో హీరోయిన్లు గా చేస్తారని టాక్ నడుస్తోంది. 


అలాగే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సైతం తన కొత్త సినిమాలో ఆర్ ఎక్స్ హాట్ భామ  పాయల్ రాజ్ పుత్ తో జోడీ కడుతున్నారు. నాగ్ నటించే మరో సినిమాలోనూ కుర్ర హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంతే అరవైలో ఇరవై అన్నట్లుగా మన సీనియర్లు రెచ్చిపోతూంటే మేము ఎక్కడా తగ్గమంటూ పరువాల అమ్మాయిలు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: