బాలయ్య పక్కన బ్యూటీస్....!!

Satya
నందమూరి అందగాడు బాలయ్య కొత్త చిత్రాల గురించి ఓ వైపు న్యూస్ వస్తూంటే ఆయన పక్కన జోడీగా నటించే తారలపైన కూడా వార్తలు వస్తున్నాయి. బాలయ్య మహానాయకుడు పూర్తి అయింది. కొత్త చిత్రాల వైపు ఆయన చూపు పడింది. వరసగా సినిమాలు చేయడానికి బాలయ్య డిసైడ్ అయ్యాడని టాక్. అందులో ఒకటి బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ మూవీ ఉంటే. మరోకటి వినాయక్ తో యాక్షన్  మూవీ అంటున్నారు. ఇదే వరసలో ఎఫ్ 2 ఫేం అనిల్ రావిపూడితోనూ బాలయ్య సినిమా ఉంటుందని తెలుస్తోంది
.
ఇక బాలయ్య మూవీస్ లో హీరోయిన్ల గురించి కూడా ఇంటెరెస్టింగ్ మ్యాటర్ లీక్ అవుతోంది. బోయపాటి. బాలయ్య మూవీలో హీరోయిన్ గా కన్నడ బ్యూటి శ్రధ్ధా శ్రీనాధ్ ని తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ బ్యూటి తెలుగులో నాచురల్ స్టార్ నాని పక్కన జెర్సీ మూవీలో చేస్తోంది. ఆమె నెక్స్ట్ మూవీయే బాలయ్య వంటి మాస్ హీరోతో పడడం రికార్డే మరి. అలాగే ఇదే మూవీలో మరో హీరోయిన్ గా కైరా అద్వానీ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఉంటారని అంటున్నారు. ఇప్పటికైతే క్లారిటీ లేకపోయినా న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.


ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి బాలయ్య మూవీలో హీరోయిన్ గా తమన్నాను తీసుకుంటారని అంటున్నారు. ఎఫ్ 2 లో వెంకటేష్ పక్కన నటించిన ఈ మిల్కీ బేబీ సీనియర్లతో స్క్రీన్ పంచుకునేందుకు రెడీ అంటోందిట. వినాయక్ మూవీలో కూడా రేర్ కాంబో తో బాలయ్య కనిపిస్తారని అంటున్నారు. ఇపుడున్న హీరోయిన్లతో పాటు, బాలయ్య ఇంతవరకూ నటించని వారే జత కడతారని చెబుతున్నారు. మొత్తాని సెంచరీ చేసినా నాటౌట్ అంటున్న బాలయ్య బ్యూటీస్ విషయంలో  కూడా నో కాంప్రమైజ్ అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: