అంజలి ‘లిసా’టీజర్ విడుదల!

Edari Rama Krishna
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో హర్రర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది.  ఒకప్పుడు హర్రర్ మూవీస్ అంటే భయపెట్టడానికే అన్న రీతిలో ఉండేవి..కానీ ఈ మద్య హర్రర్, కామెడీ తో రూపొందించడం వల్ల ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు.  ఈ నేపథ్యంలో కాంచన, గంగ, త్రిపుర,అంజలి, ఆనందో బ్రహ్మ ఈ చిత్రాలు హర్రర్ తో పాలు బోలెడంత కామెడీ ఉండటంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.   తమిళంలో అంజలి ప్రధాన పాత్రగా 'లిసా' అనే హారర్ థ్రిల్లర్ మూవీ నిర్మితమైంది. తెలుగులోను ఈ సినిమా అదే పేరుతో పలకరించనుంది.

రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.  ఆ మద్య అంజలి నటించి ‘గీతాంజలి’ మంచి విజయం సాధించింది.  ఈ చిత్రంలో అంజలి ద్విపాత్రాభినయం చేసింది.  క్రిస్మస్ కానుకగా ఈ 'లిసా'  విడుదల చేయనున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్లో రానున్న మొదటి 3డీ సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

ఇక టీజర్ చూస్తుంటే నిజంగా థ్రిల్లింగా ఉంది. ఊరికి దూరంగా వున్న ఒక పాడుబడిన ఇంట్లోకి అంజలి వెళ్లవలసి వస్తుంది. ఆ ఇంట్లో జరిగే సంఘటనలు ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని గ్రహించిన ఆమె భయంతో కంపించిపోతుంది.

అంతే కాదు ఆ ఇంట్లో రాత్రి 10 తరువాత ఎలాంటి పరిస్థితుల్లోనూ లైట్ వేయకూడదు' అనే డైలాగ్ వింటుంటే..ఈ చిత్రం ఏ రేంజ్ లో భయపెట్టబోతుందో అర్థం అవుతుంది. హారర్ జోనర్లో సినిమాలు చేయడం అంజలికి అలవాటే .. అందువలన ఈ సినిమాలో ఆమె తన పాత్రలో జీవించిందనే విషయం తెలిసిపోతూనే వుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: