వార్ లో మోసపోయిన ఆది సుశాంత్ లు !

Seetha Sailaja
ఎప్పుడు లేని విధంగా ఇద్దరు ఫెయిల్యూర్ హీరోల మధ్య ఈ రోజు జరిగిన వార్ లో ఆది - సుశాంత్ లు ఇద్దరు మోస పోయిన సందర్భం టాపిక్ ఆఫ్ ది  టాలీవుడ్ గా మారింది.  ప్రముఖనటుడు సాయి కుమార్ వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది మొదట్లో కొన్ని విజయాలు అందుకున్న ఆతరువాత వరస పెట్టి వచ్చి పడుతున్న పరాజయాలతో తన క్రేజ్ అంతా పోగొట్టుకున్నాడు. 

అక్కినేని కుటుంబ హీరోగా సుశాంత్  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు అతడు నటించిన వరకు అతడు నటించిన సినిమాల సంఖ్య 3కు దాటలేదు అంటే సుశాంత్ ఏమాత్రం టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించలేకపోయాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అటువంటి ఈ ఇద్దరు యంగ్ ఫెయిల్యూర్ హీరోలు ఈరోజు చేసుకున్న వార్ ఎవరికీ కలిసి రాకుండా ఇద్దరికీ చేదు అనుభవాలే మిగిల్చింది అన్న వార్తలు వస్తున్నాయి. 

తన కొడుకు ఆదిని ఏదోవిధంగా నిలబెట్టాలి అని భావిస్తూ సాయి కుమార్ తన కొడుకు ఆది వీరభద్రం దర్శత్వంలో  కలిసి నటించినా  ‘చుట్టాల అబ్బాయి’ సినిమాను చూసిన వారు ఈ సినిమాకు ఎందుకు వచ్చామా అని బాధ పడుతూ ఈ సినిమా టార్చర్  నరకాన్ని తలపిస్తోంది అని కామెంట్ చేసు కొంటున్నట్లు టాక్. 

తన తాత అక్కినేని నాగేశ్వరావు ‘దేవదాస్’ సినిమాలోని మాస్టర్ పీస్ సాంగ్ ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ పాటను నేటితరం అభిరుచులకు అనుగుణంగా రీమిక్స్ చేయించుకుని అఖిల్ నాగచైతన్యలను సపోర్ట్ గా తీసుకుని ప్రేక్షకులతో ఆటాడు కోవడానికి నాగేశ్వర రెడ్డి దర్శ కాత్వంలో ‘ఆట్టడు కుందాం రా’ అని వచ్చినా కనీసం అఖిల్ నాగ చైతన్యాలను చూడానికి అయినా వస్తాయి  అనుకున్న భారీ ఓపెనింగ్స్ రాక పోవడం మరింత షాకింగ్ గా మారింది. 

కథ లేకుండా ఎప్పుడో పాత చింతకాయ  పచ్చడి లాంటి కధలను పట్టుకుని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ ఒక దాని పై ఒకటి పోటీగా విడుదల చేయబడ్డ ఈ రెండు సినిమాలను చూసిన ప్రేక్షకులు మాత్రం ఇద్దరు ఫెయిల్యూర్ హీరోలు తమ తమ బోరింగ్ సినిమాలతో ఒకరి పై ఒకరు ఎందుకు పోటీగా దిగారో తెలియక తల పట్టుకుంటున్నట్లు టాక్.

 ఈ రోజు విడుదలైన  ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిన నేపధ్యంతో  పాటు గతవారం విడుదల అయిన సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’  కూడ ఏమి ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో ఈ వీకెండ్ కు కూడ ఏ సినిమాలు లేని నేపధ్యంలో సాధారణ ప్రేక్షకులకు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఒక్క ‘బాబు బంగారం’ మే దిక్కు అనుకోవాలి. ఏమైనా సుశాంత్ ఆదిలు  ఇప్పట్లో తేరుకోవడం కష్టమే అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: