మనీ: రూ.25 వేలతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే ప్రతి నెల ఆదాయం..!

Divya
ప్రతి నెల మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఎలాంటి వ్యాపారాన్ని ఎంచుకోవాలి అనేది ముందుగా ఆలోచించాలి. నష్టం లేకుండా రాబడి అధికంగా వచ్చే వ్యాపారాన్ని ఎంచుకోవడం వల్ల ఎప్పటికైనా లాభం లభిస్తుంది. అలాంటి వాటిలో పోహా కూడా ఒకటి. పోహా తయారీ యూనిట్ ను మీరు ఏర్పాటు చేసి ప్రతి నెల లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. పోహా తయారీ యూనిట్ ఏర్పాటు కి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర లోన్ పథకం కింద లోన్ తీసుకోవచ్చు. ఇందులో 90% రుణాన్ని సులభంగా పొందుతారు.
అయితే ఈ పోహా ను  చాలా మంది దొడ్డు అటుకులు అని కూడా పిలుస్తూ ఉంటారు.  పోహాను పోషక కరమైన ఆహారంగా పరిగణిస్తారు.  కాబట్టి వీటిని తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. పోహా అనేది వేగంగా జీర్ణం అవుతుంది.  అందుకే పోహా మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే కారణం. ఇటీవల కాలంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పోహాను ఎక్కువగా తీసుకుంటున్నారు.  చలికాలం అయినా వేసవికాలం అయినా ప్రజలు ప్రతినెల ఎంతో ఉత్సాహంతో దీనిని తీసుకుంటారు.  కాబట్టి ఈ వ్యాపారానికి ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గదు.  మీరు కూడా పోహా తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడం వల్ల లాభదాయకమైన వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పోహా తయారీ యూనిట్ ధర దాదాపు రూ.2 లక్షలు . ఇందులో మీకు 90% వరకు రుణం లభిస్తుంది.  అటువంటి పరిస్థితుల్లో పోహా యూనిట్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించడానికి 25వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.  గ్రామ పరిశ్రమల ప్రోత్సహించడానికి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం రుణం పొందవచ్చు. ఈ వ్యాపారం ద్వారా మీకు ప్రతి నెల అద్భుతమైన లాభం వస్తుంది. ఈ వ్యాపారంతో ఎటువంటి నష్టం కూడా కలగదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: