మనీ: ఈ నెలలో రెండోసారి వడ్డీ రేటును పెంచిన హెచ్డిఎఫ్సి..!

Divya
ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు అన్నీ కూడా వరుసగా ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేటు బ్యాంకులో కూడా వడ్డీరేట్ల సవరణపై ఎక్కువగా దృష్టి పెట్టాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ నెలలో ఈ బ్యాంకు రెండవసారి టర్మ్ డిపాజిట్లు రేట్లు పెంచడం గమనార్హం. అయితే వడ్డీ రేట్లు అనేవి కూడా మీరు డిపాజిట్ చేసే డబ్బు కాల పరిమితి పై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాంకు తాజాగా 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచింది.
రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ లపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కూడా వెల్లడించింది.  కొత్త వడ్డీరేట్లు 2022 అక్టోబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు పై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుండి 6.25% వరకు వడ్డీ రేటు అందించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు సీనియర్ సిటిజనులకు సాధారణ కస్టమర్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటు ఉంటుంది. ఈ బ్యాంకు ఇప్పుడు 6 నెలల నుంచి 120 నెలల కాల వ్యవధి ఉండే ఆర్డీ లపై సాధారణ ప్రజలకు 4.50 శాతం నుంచి 6.25% వడ్డీ రేట్లు అందిస్తోంది.

ఏడు నుంచి 14 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్ లపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3శాతం వడ్డీని అందిస్తోంది.  అదే 90 రోజుల నుంచి ఆరు నెలల లోపు ఫిక్స్ డిపాజిట్ ల పై 4.50 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. 9 నెలల ఒక రోజు నుంచి ఏడాది ఫిక్స్ డిపాజిట్ పై 5.50 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇప్పుడు 10 సంవత్సరాల డిపాజిట్లపై 6.25శాతం వడ్డీ రేటు కూడా వర్తిస్తుందని హెచ్డిఎఫ్సి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: