మనీ: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలంటే.. ఈ బిజినెస్ ఐడియా మీకోసమే..!

Divya
చాలామంది బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో.. ఉన్న ఊరిలోనే లాభసాటి వ్యాపారం చేసి చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇకపోతే వాటిలో నాటు కోడిగుడ్ల వ్యాపారం చాలా చక్కటి ఆదాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ కోడిగుడ్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే దీనినే మీరు వ్యాపారంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయడం ద్వారా ప్రతినెల ఆదాయం పొందే వీలుంటుంది. కాబట్టి మీ పెరట్లో కొంచెం స్థలం ఉంటే చాలు చక్కటి ఆదాయం పొందవచ్చు. కేవలం నాటు కోడిగుడ్లు మాత్రమే కాదు ఆర్గానిక్ ద్వారా పండించే కూరగాయలకి కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన కూడా పెరిగిన నేపథ్యంలో ఆర్గానిక్ కూరగాయలు , పండ్లు, అలాగే ఆర్గానిక్ మాంసం తినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఎడాపెడా వాడేస్తున్న రసాయనాల మూలంగా ఆహార పదార్థాలు కలుషితం అయిపోతున్నాయి.  అందుకు ఉదాహరణ పౌల్ట్రీ పరిశ్రమ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కోడి బరువు పెరగడానికి కృత్రిమంగా రసాయనాలను కోడిలోకి పంపించి.. వాటి బరువును పెంచుతున్నారు. దీనివల్ల మనుషుల ఆరోగ్యం కూడా మరింత చెడిపోయే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే నాటుకోడి మాంసము అలాగే నాటు కోడి గుడ్లు తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మీ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నాటు కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ముందుగా మీ పెరట్లో ఒక ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. అందులో నాటు కోళ్లను సేకరించి వాటి గుడ్లను ఇంక్యుబేటర్ సహాయంతో కోడి పిల్లలుగా మార్చవచ్చు.

అంతేకాదు నాటు కోళ్ల ఫారం అది తక్కువ ఖర్చుతో కూడా ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక నాటుకోడి విషయానికి వస్తే ఈ కోళ్లు ఐదవ నెల నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి ఉదాహరణకు 1000 కోళ్ళను పెంచితే రోజుకు 500 గుడ్లు ఉత్పత్తి అవుతాయి అంటే రోజుకు సుమారుగా 500 కోడిగుడ్లను మీరు ఈ విక్రయించవచ్చు ఇక లాభాలు కూడా అంతే రేంజ్ లో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: