మనీ: రైతులకు డబుల్ బొనాంజా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..ఖాతాలో రూ. 4000 జమ..!

Divya
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబుల్ బొనాంజా ప్రకటించింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నంద్యాల జిల్లాలో తాజాగా పర్యటిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డలో జరుగుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా - పీ ఎమ్ కిసాన్ రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈయన 10: 15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఇక 10:45 గంటలకు ప్రభుత్వ జార్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యి ప్రసంగించడం మొదలుపెట్టారు.

ఇక ఈరోజు కంప్యూటర్ బటన్ నొక్కి ఆయన నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే రైతుల ఖాతాలో వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ రెండవ విడత నిధులు ఒకేసారి నాలుగువేల రూపాయలుగా జమ కానున్నాయి.  ఇక రైతులు కూడా తమ ఖాతాలలో ఈ అమౌంట్ పడిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక పండుగ వేళ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి నిధులు విడుదల చేయడంతో పండుగ వేళ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికొస్తున్న నేపథ్యంలో కూలీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కూలీల కోసం ఈ డబ్బు కొంతవరకు ఊరట ఇస్తుంది అని చెప్పవచ్చు.

ఇకపోతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది.  2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ.6000 జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మొత్తం మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నగదును .. రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు 11 విడతల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 12వ విడతను కూడా విడుదల చేసింది. మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: