మనీ: బిజినెస్ కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పత్రాలు తప్పనిసరి..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థికంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఆర్థికంగా తమను తాము పదిలం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఉద్యోగం చేస్తే మరి కొంత మంది వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే వ్యాపారం చేయాలని అనుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా పెట్టుబడి కూడా అవసరం అవుతుంది. మరి పెట్టుబడి కావాలి అంటే ఎవరు సహాయం చేస్తారు.. బయట తీసుకుంటే వడ్డీలు కట్టలేక మరింత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్రయించే ఏకైక మార్గం బ్యాంక్.. మీరు తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చు. లేకపోతే బ్యాంకులో బిజినెస్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇకపోతే ప్రస్తుతం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అవసరమైన పత్రాలు ఉంటే మీరు డైరెక్ట్ గా బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చాలా కంపనీలు ఇచ్చే రుణం పై వడ్డీ ఎక్కువ వసూలు చేస్తుంటాయి. నిజజీవితంలో కూడా ఒక బ్యాంకు మీకు లోన్ ఇస్తుందంటే అది కచ్చితంగా మీ వ్యాపార ప్రణాళికను తెలుసుకొని ఉంటుంది. ఇక మీరు ఏ వ్యాపారానికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా అందుకు సంబంధించిన ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ సామర్థ్యం,  ప్రణాళిక కూడా స్పష్టంగా వారికి నిరూపించాల్సి ఉంటుంది.  ఇలా చేయడం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సులభంగా సమాధానాలు చెప్పగలుగుతారు . అప్పుడు రుణం పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మీరు లోన్ అప్లై చేయడం కోసం ఆధార్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , ఓటర్ ఐడి , పాన్ కార్డు , అడ్రస్ ప్రూఫ్,  6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.  వ్యాపార రుజువు పత్రాల కోసం వ్యాపారం రుజువు , జిఎస్టి రిటర్న్ స్టేట్మెంట్ ,వ్యాపార చిరునామా,  రిజిస్ట్రేషన్ పత్రాలు , రుణం తీసుకున్న వ్యక్తి వ్యాపారానికి సంబంధించి రెండు యేళ్ళ పాటు ఐటీఆర్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇవన్నీ సమర్పిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ సమయంలోనే లోన్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: