మనీ: అటల్ పెన్షన్ యోజన పథకంలో కొత్త రూల్..!

Divya
 ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పెన్షన్ పథకాలలో అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. కాబట్టి ముఖ్యంగా దీనిని అసంఘటిత రంగాలలోని వారికి పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఈ పెన్షన్ స్కీమ్ లో కీలక మార్పు చేసింది కేంద్ర ఆర్థిక శాఖ..  కేవలం పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి అర్హులు కాదు అని ప్రకటించడం జరిగింది. ఇక ఈ కొత్త రూల్ 2022 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా సరే ఆదాయపు పన్ను చెల్లింపుధారుగా ఉంటే వారు 2022 అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి అర్హులు కారు అని స్పష్టం చేసింది.
మీలో ఎవరైనా సరే అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పథకంలో చేరితే వారు ఆదాయపు పన్ను చెల్లింపుధారుగా గుర్తిస్తే ఆటోమేటిగ్గా వారి అకౌంటు క్లోజ్ అవుతుందట. ఇక చెల్లించిన డబ్బులు మాత్రం రిఫండ్ వస్తాయని ఇక ఇప్పటికే ఈ స్కీమ్లో ఇన్కమ్ టాక్స్ ప్లేయర్స్ ఉన్నట్లయితే వారి అటల్ పెన్షన్ యోజన అకౌంటు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు జమ చేసిన మొత్తం సబ్స్క్రైబర్ కు తిరిగి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం నిత్యం ఈ పథకాన్ని సమీక్షిస్తూ అటల్ పెన్షన్ యోజన పథకంలో ఆదాయపు పన్ను చెల్లింపు దారులను తొలగించబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ పథకం ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఇక వారికి ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. కొత్త రూల్స్ ప్రకారం ఇన్కమ్ టాక్స్ పేయర్స్ ఈ స్కీమ్ లో చేరడానికి అనర్హులు. ఇక ఈ స్కీం లో లబ్ధిదారులకు 60 సంవత్సరాల తర్వాత రూ. 5,000 వరకు పెన్షన్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: