మనీ: ఈ వ్యాపారంతో 50 వేలకు పైగా ఆదాయం.. ఎలా అంటే..?

Divya
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేయడం కంటే ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఇక బిజినెస్ ఐడియా ద్వారా ఎంతోమంది యువతి, యువకులు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ.. మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. ఇక ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన బిజినెస్ ఐడియా కోడిగుడ్ల వ్యాపారం. ఇక ఈ వ్యాపారం వల్ల నిరంతర ఆదాయం వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాలం మారుతున్న కొద్ది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. అత్యధిక పోషకాలు కలిగిన కోడిగుడ్లను కూడా తినడానికి అందరూ ఆసక్తి చెబుతున్నారు.
కాబట్టి పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లను అమ్మడం వల్ల మనకు కూడా లాభాలు మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా కోడిగుడ్లను మీరు హోల్సేల్ దుకాణాల వద్దకు వెళ్లి కొనుగోలు చేసి వాటిని కాలేజీలు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, హోటల్స్, ఇళ్లకు మీరు ఎగ్స్ సప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొనుగోలు చేసి. కోడిగుడ్లను మీరు సరఫరా చేయవచ్చు. ఇకపోతే ఫోరం గేట్ వద్ద ఒక కోడి గుడ్డు ధర సుమారుగా నాలుగు రూపాయలు ఉంటే.. మీరు మాత్రం మార్కెట్లో ఒక్కో ఎగ్గు ధర 5 రూపాయల వరకు అమ్మే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాదు కొన్ని ప్రాంతాలలో రూ.6 లేదా 7 రూపాయల వరకు ఈ కోడిగుడ్డు ధర పలుకుతోంది.

ఇక హోల్ సెల్లర్ , రిటైలర్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఒక్కో రూ.1 లాభంగా పంచుకోవాల్సి ఉంటుంది
ఇక మీరు 20 షాపుల్లో 5 ట్రే ల చొప్పున 100 ట్రేలను కనుక సప్లై చేస్తే సుమారుగా మీకు 600 రూపాయలు లాభం వస్తుంది. ఇక ఎంత లేదన్న నెలకు 18 వేల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. ఇక మొత్తం గా చూసుకుంటే 50 వేల వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: