మనీ: ఈ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్న మహిళలు..!!

Divya
ముఖ్యంగా ఆడవారు ఎందులో కూడా తక్కువ కాదని ఇటీవల కాలంలో చాలామంది నిరూపిస్తున్న విషయం తెలిసిందే.. ఇంటికే పరిమితమైపోవాలని ఆలోచించే మహిళలు సైతం నేడు తమ ప్రతిభను ఉపయోగించి ముందడుగు వేస్తున్నారు. కుటుంబ బాధ్యతలను తీసుకునే ఆడవారు.. నేడు డబ్బు సంపాదించే స్థాయికి చేరుకొని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోని మునగ ఆకుతో కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు మన ఆడవారు. పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో ఒక మారుమూల ప్రాంతానికి చెందిన దీపిక అనే ఒక అమ్మాయి తన ఉన్నత విద్యను పూర్తి చేసి.. ఉద్యోగ బాట పట్టింది కానీ ఉద్యోగం రాకపోయేనా నిరుత్సాహపడకుండా  మునగ చెట్లతో వ్యాపారం చేయాలని ఆలోచన చేసింది. ఆమె ఇక ముఖ్యంగా తన ఇంటి చుట్టుపక్కల మునగ చెట్లు ఎక్కువగా ఉండడంతో వీటివల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా దీపిక కొంచెం అవగాహనకు వచ్చింది . ఇక వాటిపై మరింత అధ్యయనం చేసింది. వీటితో సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులను కూడా తయారు చేయవచ్చు అని ఆలోచన దీపికకు రావడం జరిగింది. అలా 2017 లో గుడ్డు లీఫ్ అనే స్టార్టర్ కంపెనీని మొదలు పెట్టింది.

నిజానికి మునగ ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఇందులో జింక్ ,  కాల్షియం,  ఐరన్,  ఫాస్ఫరస్ , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ వారికి చక్కటి ఔషధమని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె సుమారుగా నాలుగైదు జిల్లాలలో 200 మంది రైతులతో మాట్లాడి మునగ సాగు పంటను ప్రారంభించింది . ఇక అక్కడి నుంచి వచ్చే ఆకులు, పువ్వులు,  కాయలు అన్ని సేకరించి ముఖానికి , శరీరానికి,  వెంట్రుకలకు అవసరమైన పొడులు,  క్యాప్సిల్స్,  ఫేస్ ప్యాక్లను తయారు చేయడం మొదలుపెట్టారు . ఇక ఎంతో అధ్యయనం ప్రయోగాల ద్వారా ఇది సాధ్యమైందని దీపిక వెల్లడించింది. ఇకపోతే ప్రస్తుతం నాలుగు సంవత్సరాల లోని కోటి రూపాయలకు పైగా టర్నవర్ ను చేరుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. కష్టపడితే సాధించనిధి ఏమీ లేదు  అంటూ మరొకసారి నిరూపించింది దీపిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: