మనీ : వీటి వ్యాపారం తో లక్షల్లో ఆదాయం ఎలా అంటారా..?

Divya
ఇటీవల కాలంలో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇకపోతే ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిలో సుగంధ ద్రవ్యాలు కూడా ఒకటి. మరీ ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలను పండించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలోని ప్రతి వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే చాలా మంది ఇలా సుగంధ ద్రవ్యాలను పండించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు . భారతీయ వంటలలో కూడా ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల ధర కూడా అధికంగా పలుకుతున్న నేపథ్యంలో రైతులకు లాభాల వర్షం కురిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలను పండించ లేరు అనుకుంటే ఇంటి నుండి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి మసాలాలు తయారు చేసి మార్కెట్లోకి విక్రయించవచ్చు.

ముఖ్యంగా మీ ఇంటి సమీపంలో ఉన్న ప్రజల యొక్క ఆహారపు అలవాట్లను తెలుసుకొని వారి రుచులకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలతో మసాలా పొడులను తయారు చేసి మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా రుచికరమైన మంచి సువాసన కలిగిన మసాల పొడులను తయారు చేసి ఇతరులకు అమ్మడం వల్ల కూడా డబ్బులు లభిస్తాయి. ఇక సాధారణంగా సుగంధ ద్రవ్యాలను తయారు చేసే యంత్రం కొన్ని లక్షల రూపాయలు విలువ అవుతుంది . కాబట్టి మీరు అంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయలేము అనుకుంటే మీ ఇంట్లో మిక్సీ జార్, రోల్లను ఉపయోగించి కూడా మసాలా పొడులను తయారు చేయవచ్చు.

ముఖ్యంగా రోటి లో దంచే మసాలా పొడి లకు మంచి డిమాండ్ వుంది.. మీరు కనుక ఒక ఇద్దరు మహిళల సహాయంతో మసాలా పొడులను తయారు చేసి కవర్లలో ప్యాక్ చేసి దుకాణాలలో అమ్మడం వల్ల మంచి లాభం వస్తుంది. ఇక మీరు పెట్టే పెట్టుబడికి లక్షల్లో కూడా ఆదాయం లభిస్తుంది.  ప్రస్తుతం ఒక ప్యాకెట్ 20 రూపాయల చొప్పున తీసుకున్నా పది ప్యాకెట్ల తో రెండు వందల రూపాయలు సులభంగా వస్తుంది. ఇక గంటకు పది ప్యాకెట్లు ను సులభంగా తయారు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: