మనీ: ఈ బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల లో మార్పులు..!!

Divya
ప్రైవేటు బ్యాంకు కు చెందిన కర్ణాటక బ్యాంక్..2022-23 వ సంవత్సరానికి గాను మొదటిరోజున కస్టమర్లకు బహుమతి అందించడం జరుగుతోంది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ ల వడ్డీరేట్లలో కర్ణాటక బ్యాంకు మార్పులను చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వడ్డీ రేట్లు నిన్నటి రోజు నే అమలు లోకి వస్తాయి అని తెలియజేసింది. బ్యాంకులో ఇప్పుడు గరిష్టంగా..5.50 % వడ్డీని అందిస్తోందట. ఒకటి నుండి రెండు ఏళ్ల లో చెల్లించే.. ఫిక్స్డ్ డిపాజిట్ల పై బ్యాంకు ఖాతాదారుల కోసం 5.10 % వడ్డీ ను అందిస్తోంది.

రెండు నుంచి ఐదు సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై కూడా 5.40% వడ్డీని, 5 నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 5.50% పొందవచ్చట. ఇక ఇందులో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఖాతాదారుల సహా అన్ని సేవింగ్ బ్యాంకు ఖాతాలకు వడ్డీరేట్లను..2.75-4.50 % మధ్యలో ఉండనున్నట్లు తెలియజేశాయి.. బ్యాంకు వెబ్సైట్ ప్రకారం డొమెస్టిక్ ఫిక్స్డ్ డిపాజిట్ ల కింద.. రూ. ఐదు కోట్ల వరకూ FDP ని 0.40 % ఎక్కువ వడ్డీ లభిస్తుందని తెలియజేసింది.RBL బ్యాంక్, IDFC బ్యాంకు ఖాతాల పొదుపు వడ్డీరేట్లను మార్చాయి..
1).IDFC:
ఏప్రిల్ 1 -2022 నుండి బ్యాంకింగ్ సేవింగ్ ఖాతాలలో ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసినట్లయితే..4% వడ్డీ అందుబాటులో ఉంటుందట.. ఈ రేటు రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల లోపు వరకు  పొదుపు పై ఉంటుంది.. వీటికంటే ఎక్కువ మొత్తంలో చేసేవారికి..4.5 % కంటే ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మొత్తం పొదుపు చేసే వారికి 5% అందిస్తోందట.
2).RBL BANK:
 RBL bank తన పొదుపు ఖాతా వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి దానిని 1 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి రూ.లక్ష వరకు పొదుపుపై 4.25 శాతం ఇస్తోంది.  రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పొదుపుపై 5.5 శాతం వడ్డీని బ్యాంక్  వడ్డీ ని ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల నుంచి రూ.3 కోట్లకు పైగా పెట్టిన  పొదుపుపై 6 శాతం వడ్డీని, ఇక రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు 6.25 శాతం వడ్డీని కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: