మనీ : కేవలం రూ.6 స్టాక్ తో భారీ లాభాలు..!!

Divya
మీరు ప్రస్తుతం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా అయితే మంచి లాభాలను అందించే పెన్నీ స్టాక్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లు అయితే మీ కోసం ఒక మంచి స్టాక్ మీ ముందుకు రావడం జరిగింది. ఒక కంపెనీ ఇలాంటి వారిని బాగా ఆకర్షిస్తూ దలాల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్ గా మారడం గమనార్హం. అంతే కాదు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా పెరుగుతున్నాయి.. ఇక పోతే ఆ స్టాక్ పేరు ఏమిటి.. దాని విలువ ఎంత ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ లో ఎవరైనా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మంచి షేర్స్ కోసం కూడా వారు ఎదురు చూడడం మొదలు పెట్టి ఉంటారు. ఎందుకంటే తమ అంచనా ప్రకారం అవి గనుక భారీ ర్యాలీ చేస్తే అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా ధనవంతులు కావచ్చు అనేది అందరి ఆలోచన. ఇక మీరు కూడా అలాంటి ఆలోచనలో ఉన్నట్లు అయితే మీకు వికాస్ ఎకోటెక్ షేర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మార్కెట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.
వికాస్ ఎకోటెక్ స్టాక్ ఇన్వెస్టర్ల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎస్ఈ లో ఈ స్టాక్ ధర  రూ.5.82 కాగా స్వల్పకాలంలోనే దీని విలువ రూ.11.60 కి చేరిపోయింది. ఈ షేరు మరింత విలువ పెరిగే అవకాశం ఉందని కన్సాలిడేషన్ కంటే ఎక్కువ అవుతుందని కూడా ఐ ఐ ఎఫ్ ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా  స్పష్టం చేశారు. ఇకపోతే నోమురా సింగపూర్ లిమిటెడ్ వారు సుమారుగా 2022 మార్చి 24 వ తేదీన బల్క్ డీల్ కింద 66 లక్షల షేర్లను రూ.5.35 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. చిన్న  ఇన్వెస్టర్లకు ఇదొక పెద్ద న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఇన్వెస్టర్ గ్రూప్ కంపెనీ.. షేర్లను బల్క్ మొత్తంలో కొనుగోలు చేస్తే  .. చిన్న ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరుగుతుంది అందుకే మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లక్షల మొత్తంలో లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: