మనీ: రైతులకు త్వరలోనే రుణమాఫీ..!

Divya
ఇటీవల తెలంగాణ రాష్ట్ర రైతులకు.. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. అదేమిటంటే ఇప్పటివరకు రూ.50 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని లక్ష వరకు పెంచుతూ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇక రైతులకు ఇచ్చే రుణమాఫీ లో భాగంగా లక్షలోపు అలాగే వడ్డీతో సహా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇకపోతే ఇప్పటికే 50 వేల లోపు ఇస్తామన్న రుణమాఫీ కి సంబంధించి వచ్చే నెల మార్చి బడ్జెట్ లో నిధులు కేటాయించేలా చూస్తున్నామని తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కూడా తెలిపారు.
ఇటీవల సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణానికి దగ్గరలో ఉన్న కిషన్ నగర్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి , శంకుస్థాపన చేయడం కోసం జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వారు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే కచ్చితంగా నెరవేరుస్తామని, ఈ సందర్భంగా తెలిపారు.. ఎవరైతే సొంత ఇంటి స్థలం వుండి, ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉంటారో అలాంటి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అని ఇందుకోసం ఏకంగా పది వేల కోట్ల రూపాయల నిధులను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించినట్లు వారు వెల్లడించారు..

అంతేకాదు ఇప్పటికే పలుచోట్ల మిగిలిపోయిన రిజర్వాయర్లను కూడా త్వరలోనే పూర్తి చేయాలని, వాటికి సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రతినిధులు పేర్కొన్నారు.ఇక కరోనా  సోకి మరణించిన జర్నలిస్టుకు ప్రెస్ అకాడమీ ద్వారా 20 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారు రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: