హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వెస్ట్‌లో గ్రంథి టాప్...మళ్ళీ పవన్ నిలబడిన కష్టమేనా?

గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కల్యాణ్‌ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌ పేరు ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉన్న పవన్‌ని ఓడించడమంటే మాటలు కాదనే చెప్పాలి. అసలు భీమవరంలో పవన్ కల్యాణ్ ఖచ్చితంగా గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారు చేస్తూ, జగన్ వేవ్‌లో గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు.
ఇలా పవన్ కల్యాణ్‌ని ఓడించి అంచనాలు పెంచేసిన గ్రంథి...ఆ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా గ్రంథి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తూ,  మరింతగా ప్రజల మద్ధతు పొందుతున్నారు. అటు భీమవరంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అలాగే ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లని బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలకు గ్రంథి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఆక్వా రైతులని ఆదుకోవాల్సిన అవసరముంది. అలాగే ఇక్కడ ఆక్వా సాగు కారణంగా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. కరోనా వల్ల ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోయారు...వారికి అండగా ఉండాల్సిన అవసరముంది. భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.
ఇక రాజకీయంగా చూసుకుంటే భీమవరంలో గ్రంథి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా గ్రంథికి మంచి మార్కులు పడుతున్నాయి. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల్లో గ్రంథి టాప్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ నేత పులపర్తి అంజిబాబు అడ్రెస్ లేరు. అటు ఓడిపోయాక పవన్ కల్యాణ్ సైతం భీమవరం రాలేదు. ఇలా రెండు పార్టీలు సరిగ్గా లేకపోవడం వల్ల గ్రంథికి బాగా ప్లస్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ పవన్..మళ్ళీ ఇక్కడ నిలబడిన గ్రంథినే గెలిచేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: