హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నాగార్జునకు సీన్ రివర్స్ అవుతుందా?

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో వేమూరు కూడా ఒకటి. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చాయి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వేమూరులో ఆరు సార్లు విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి వైసీపీ విజయం సాధించింది.
వైసీపీ తరుపున మేరుగు నాగార్జున ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకముందు నాగార్జున కాంగ్రెస్‌లో పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరుపున వేమూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014లో కూడా ఓడిపోయారు. ఇక 2019లో జగన్ గాలిలో నాగార్జున గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా నాగార్జున పర్వాలేదనిపిస్తున్నారు. మరీ గొప్ప పనితీరు కనబర్చకపోయినా, కొంతవరకు బెటర్ అనిపిస్తున్నారు.
ప్రభుత్వం తరుపున పథకాలు నాగార్జునకు బాగా ప్లస్ అవుతున్నాయి. అలాగే వేమూరులో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలీజ్ హెల్త్ క్లినిక్‌లు, సి‌సి రోడ్లు నిర్మాణాలు జరిగాయి. నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందగా, జగనన్న కాలనీల ద్వారా పేదలకు కొత్తగా ఇళ్ళు కట్టిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ చివరి ఆయకట్టుకు నీరు అందడం చాలా కష్టం.  వేమూరు నియోజకవర్గంలో మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం అధికంగా ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో పట్టుగూళ్ల ధరలు ఆశాజనకం లేకపోవడంతో అక్కడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. అటు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
రాజకీయంగా చూసుకుంటే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే సత్తా చాటింది. అధికారంలో ఉండటంతోనే విజయం దక్కిందని చెప్పొచ్చు. కానీ ఎమ్మెల్యేగా నాగార్జున మంచి మార్కులు తెచ్చుకోవడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు బాగానే పికప్ అయినట్లు కనిపిస్తోంది. ఈయన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో వేమూరులో నాగార్జునకు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: