హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పయ్యావులకు ఈ సారి కలిసొస్తుందా?

పయ్యావుల కేశవ్...తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు...దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో పనిచేస్తున్న పయ్యావులకు కాస్త అదృష్టం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి టీడీపీ అధికారంలోకి రాదు. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల, టీడీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన పయ్యావుల తొలిసారి ఎమ్మెల్యే కావడంతో కీలక పదవులు ఏమి రాలేదు.
ఆ తర్వాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోగా, తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఏమో రివర్స్ జరిగింది. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే, టీడీపీ అధికారం కోల్పోయింది. వరుసగా 2009 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక పయ్యావుల దురదృష్టం ఏంటో గానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వస్తే, పయ్యావుల ఎమ్మెల్యేగా ఓడిపోగా, 2019 ఎన్నికల్లో రివర్స్‌లో జరిగింది. పయ్యావుల నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది.
ఇలా పయ్యావులకు వరుసగా అదృష్టం కలిసిరాలేదు. అందుకే మంత్రి పదవి లాంటివి రాలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండటంతో కీలకమైన పి‌ఏసి  ఛైర్మన్ పదవి దక్కగా, దీంతో అధికారం వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఆర్ధిక పరమైన అంశాల్లో వైసీపీ అవలంభిస్తున్న విధానాలని ప్రజల ముందు పెడుతున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థని ఛిన్నాభిన్నం చేస్తుందని ఫైర్ అవుతున్నారు.
అటు ఎమ్మెల్యేగా పయ్యావుల పెద్దగా ఉరవకొండ నియోజకవర్గానికి చేసేది ఏమి లేదు. ప్రతిపక్షంలో ఉండటంతో పెద్దగా పనులు జరగడం లేదు. కాకపోతే ఉరవకొండలో ఉండే సమస్యలపై బాగానే స్పందిస్తున్నారు. అటు వైసీపీ తరుపున వై. విశ్వేశ్వర్ రెడ్డి పనిచేస్తున్నారు. అధికారంలో ఉండటం ఈయనకు కలిసొస్తుంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వీరి మధ్య టఫ్ ఫైట్ ఉండేలా కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో పయ్యావుల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి తప్పనిసరిగా వస్తుంది. మరి ఈసారి పయ్యావులకు కలిసొస్తుందో లేదో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: