హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పరిటాల ప్రత్యర్ధి దూకుడు మామూలుగా లేదా!

అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పరిటాల ఫ్యామిలీకి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెక్ పెట్టేశారు. ఆ ఎన్నికల్లో సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్‌కు టిక్కెట్ దక్కేలా చేశారు. తొలిసారి పోటీ చేసి శ్రీరామ్ దాదాపు 25 వేలపైనే మెజారిటీతో తోపుదుర్తి చేతిలో ఓడిపోయారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తోపుదుర్తి దూకుడుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త సచివాలయాలు, సి‌సి రోడ్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎలాగో వస్తున్నాయి.
రాజకీయంగా చూసుకుంటే రాప్తాడుపై తోపుదుర్తి పట్టు పెంచుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ ఇంకా పుంజుకోలేదు. కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా చేస్తే, కొన్నిరోజులు అడ్రెస్ ఉండటం లేదు. దీంతో ఎప్పటినుంచో పరిటాల ఫ్యామిలీని మోస్తున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు తోపుదుర్తి వైపు వచ్చేశారు. నిదానంగా తోపుదుర్తి పట్టు తెచ్చుకోవడం, రాప్తాడులో వైసీపీ హవా నడుస్తోంది. కాకపోతే పరిటాల ఫ్యామిలీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
రాప్తాడులో టీడీపీ బలం తక్కువ ఏమి కాదు. పరిటాల ఫ్యామిలీకి మంచి బలం ఉంది. ఏ సమయంలోనైనా పుంజుకునే అవకాశాలున్నాయి. పైగా శ్రీరామ్‌కు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇస్తారని టాక్. అప్పుడు శ్రీరామ్ కూడా దూకుడుగా ఉండే అవకాశముంది. ఇక రాప్తాడులో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవికాలంలో ఇక్కడి ప్రజలు తాగునీరు కోసం ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అలాగే నియోజకవర్గ పరిధిలో పలు రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఇంకా నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలని పరిష్కరిస్తే రాప్తాడులో తోపుదుర్తికి తిరుగుండదు.              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: