హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: హరిప్రియకు సెకండ్ ఛాన్స్ ఉందా?

రాజకీయాల్లో యువత అంత తొందరగా సక్సెస్ చూడలేరు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అవకాశాలు రాకపోవడం, సీనియర్ల మధ్యలో ఎదిగే అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కానీ 30 ఏళ్ల కూడా నిండకుండానే బానోత్ హరిప్రియకు రాజకీయంగా మంచి అవకాశం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు...హరిప్రియకు 2014 ఎన్నికల్లో సీటు ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సీటు ఆమెకు కేటాయించారు. కానీ తొలిసారి మంచి అవకాశం వచ్చిన గెలిచే అవకాశం రాలేదు.
అయితే తెలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారు అవ్వడంతో హరిప్రియ కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. రేవంత్ రెడ్డి పాటు కలిసి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అప్పటినుంచి ఆమె రేవంత్ రెడ్డి వర్గంగా ఉంటూ వచ్చింది. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇల్లందు సీటులో పోటీ చేశారు. అప్పుడు టీడీపీ పొత్తు కూడా ఉండటం హరిప్రియకు బాగా కలిసొచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం దక్కింది. టీఆర్ఎస్‌పై అనూహ్యంగా విజయం సాధించారు.
ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయిన హరిప్రియ రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో కూడా బాగా తెలుసుకున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే కష్టమని చెప్పి అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఖమ్మంలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరాక అనుకున్న పనులు చేయగలుగుతున్నారు. అలాగే ప్రజలకు టచ్‌లోనే ఉంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూసుకుంటున్నారు.
అలాగే నిధులు తెచ్చుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. కొత్త సి‌సి రోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్‌ల నిర్మాణాలు జరిగాయి. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో జాప్యం జరుగుతోంది. అయితే ఇల్లందులో అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.
ఇక ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం తక్కువగా ఉంది. హాస్పిటల్స్, తాగునీటి వసతులు తక్కువ. ఇక దశాబ్దాల కాలం నుంచి పోడు భూముల సమస్య పరిష్కారం కావడం లేదు. రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే హరిప్రియపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు లేకపోవడం ఎమ్మెల్యేలు ప్లస్. ఇక్కడ బీజేపీకి బలం లేదు. మరి చూడాలి హరిప్రియకు సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: